మహాభారతం పై మళ్లీ స్పందించిన జక్కన్న

Update: 2019-12-30 08:59 GMT
రాజమౌళి కి మహాభారతం తీయాలనే కోరిక అనే విషయం అందరికి తెల్సిందే. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా రాజమౌళి మహాభారతం తీస్తాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన కూడా వాటిని సమర్ధిస్తూనే కాని ఇప్పుడు కాదు అంటూ చెబుతూ వచ్చాడు. మహాభారతంను ఒక్క పార్ట్‌ లో కాకుండా ఎక్కువ పార్ట్‌ లలో చేస్తానంటూ ఆమద్య చెప్పుకొచ్చాడు. బాహుబలి తర్వాత వెంటనే మహాభారతం చేస్తాడని కొందరు అనుకున్నారు. కాని మహాభారతం తీయడానికి నాకు ఇంకా అనుభవం కావాలి.. ఇంకా టెక్నాలజీ పెరగాలంటూ ఆమద్య చెప్పిన రాజమౌళి ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ ఒక వైపు జరుపుతూనే మరో వైపు తన కుటుంబంకు చెందిన పిల్లలు తీసిన 'మత్తువదలరా' చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మత్తువదలరా చిత్రం టీం జైసింహా... అగస్త్య మరియు సత్యల తో రాజమౌళి చిట్‌ చాట్‌ నిర్వహించాడు. కొద్ది సమయం వారిని ఇంటర్వ్యూ చేశాడు. అదే సమయంలో వారు కూడా రాజమౌళిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ సందర్బంగా మీరు బాహాభారతం ఎప్పుడు తీస్తారు.. మీరు ఒక్క పార్ట్‌ అయినా తీయగలరా అంటూ ప్రశ్నించగా రాజమౌళి స్పందిస్తూ... తాను మహా భారతం పూర్తిగా తీస్తాను. దాన్ని నేను నా స్టైల్‌ లో చిన్న కథగా మార్చుకోగలను అన్నాడు.

ఒక కథ రాస్తున్నప్పుడు కొన్ని సార్లు ఇబ్బందులు వస్తాయి. వాటిని పట్టించుకోకుంటే అవే పక్కకు వెళ్లి పోతాయి. తాను ఎక్కువగా ఈ పద్దతినే ఫాలో అవుతానంటూ చెప్పుకొచ్చాడు. మహాభారతం చిత్రం విషయంలో జక్కన్న గతంలో చెప్పిన విషయమై మళ్లీ చెప్పినా కూడా జనాల్లో మాత్రం జక్కన్న మహాభారతం గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఆయన ఎప్పుడెప్పుడు మహాభారతం తీస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News