ప‌వ‌న్ ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రు.. వ‌కీల్ సాబ్ ను ఆకాశానికెత్తిన శృతిహాస‌న్‌..!

Update: 2021-02-26 10:45 GMT
శృతిహాసన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ తో 2021ని ఘ‌నంగా ప్రారంభించిందీ బ్యూటీ. సంక్రాంతి బ‌రిలో నిలిచిన ‘క్రాక్’ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మ‌రో రెండు భారీ చిత్రాలు లైన్లో ఉన్నాయి. ప‌వ‌న్ తో క‌లిసి న‌టించిన ‘వ‌కీల్ సాబ్‌’ మూవీ సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ సరసన నటిస్తున్న ‘సలార్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి నటించిన ‘లాభం’ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన శృతిహాస‌న్ ‘వ‌కీల్ సాబ్‌’, ‘లాభం’ చిత్రాలపై త‌న అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఇవి రెండు చిత్రాలూ సామాజిక సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందాయ‌ని చెప్పారు. మహిళల భద్రత, హక్కుల గురించి చ‌ర్చించే చిత్రంగా ‘వ‌కీల్ సాబ్’ ఉండబోతోంద‌ని, సినిమాల ద్వారా సందేశాన్నివ్వ‌డం గొప్ప విష‌యం అని అన్నారు శృతి.

అంతేకాదు.. ప్రజల్ని ప్రభావితం చేయగల పవన్ కల్యాణ్ లాంటివారు ఇలాంటి సినిమాల్లో నటించడం చాలా బాగుందని అన్నారు. “సినిమా ద్వారా సందేశాలివ్వడం గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. వకీల్ సాబ్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రాబోతోంది. ప్రజల్ని ప్రభావితం చేయగల పవన్ కళ్యాణ్ లాంటి వారు సందేశాత్మక చిత్రాల్లో నటిస్తే చాలా బాగుంటుంది. ప్రజల ఆలోచనలను రేకెత్తించడానికి వారు ఎంతగానో తోడ్పడతారు’’ అని అన్నారు శృతిహాస‌న్‌.

ఇక‌, త‌న ‘లాభం’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఇది రైతుల సమస్యలను చర్చించే సినిమా అని తెలిపారు. ప్రస్తుతం రైతుల ఆందోళనలు నేపథ్యంలో ఈ మూవీ ప్రజల్లో ప్రతిధ్వనిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో ఛాలెంజింగ్ రోల్స్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది శృతి.




Tags:    

Similar News