బిబి4 విన్నర్ పై ఫ్యామిలీ స్టార్ గెస్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. ఈ సందర్బంగా విజేత ఎవరై ఉంటారు అంటూ చాలా మంది చాలా రకాలుగా అంచనాలు వేస్తున్నారు. అయితే ఎక్కువగా మాత్రం అభిజిత్ విజేత అయ్యే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. కొందరు సినీ ప్రమఖులు.. బిగ్ బాస్ ను ఫాలో అయ్యే వారు కూడా అభిజిత్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. చాలా స్టెబుల్ గా గేమ్ ఆడుతున్న అభిజిత్ కు విన్నర్ అయ్యే అర్హతలు ఉన్నాయి అంటూ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా చెప్పుకొచ్చాడు.
తాజాగా శ్రీకాంత్ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ... నేను తెలుగు బిగ్ బాస్ షో ను రెగ్యులర్ గా పాలో అవుతాను. కేవలం తెలుగు భాష బిగ్ బాస్ మాత్రమే కాకుండా ఇతర భాషల బిగ్ బాస్ షో లను కూడా తాను ఫాలో అవుతాను అన్నాడు. ఈ షో అంటే నాకు మొదటి నుండి కూడా ఆసక్తి. ఈ షో వల్ల చాలా మంది మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్స్ కూడా అయ్యారు. మానసికంగా బలపడేందుకు ఈ షో చాలా బాగా ఉపయోగపడుతుందని.. తనను తాను జనాలకు చూపించేందుకు ఈ షో ఒక మంచి వేదిక అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ విన్నర్ ఎవరో ఖచ్చితంగా చెప్పలేకున్నా అభిజిత్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సోహెల్ మరియు అరియానాలు కూడా బాగా కష్టపడుతున్నారని శ్రీకాంత్ అన్నాడు. అభిజిత్ తన ఫేవరేట్ కంటెస్టెంట్ అంటూ శ్రీకాంత్ పేర్కొన్నారు.