శ్రీరెడ్డికి బన్నీతో డేటింగ్ కావాలట

Update: 2018-03-24 04:50 GMT
అవకాశాలు ఇప్పిస్తామంటూ మహిళలను లైంగికంగా ఉపయోగించుకోవడం.. సింపుల్ గా ట్రెండింగ్ లో ఉన్న వర్డింగ్ ప్రకారం అయితే.. క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని పక్కాగా వాడేసుకుంటూ ఛానల్స్ చుట్టూ తెగ తిరిగేస్తోంది యాక్ట్రెస్ శ్రీరెడ్డి. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై రచ్చ జరుగుతుండగా.. వివాదాలతో పబ్బం గడుపుకునేందుకు చూసే ఛానళ్లు.. ఈ అంశాన్ని తమ రేటింగుల కోసం కూడా వాడుకుంటున్నాయి.

అయితే.. ఎంతసేపూ వివాదాల చుట్టూనే తిరుగుతూనే ఉంటే గొడవలు అరుపులు మాత్రమే ఉంటాయి కానీ.. అందుకు కావాల్సిన స్పైస్ దొరకదు కదా. అందుకే రీసెంట్ గా క్యాస్టింగ్ కౌచ్ గురించి కాకుండా.. వేరే పాయింట్ పై శ్రీరెడ్డికి ఓ ప్రశ్న ఎదురైంది. మీరు ఎవరితో అయినా డేటింగ్ కు వెళ్లాలని అనుకుంటే.. ఆ ఒకరు ఎవరు అనే క్వశ్చన్ ఎదురైంది. దీనికి శ్రీరెడ్డి కూడా తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చేసింది. తనకు గానీ అవకాశం వస్తే.. అల్లు అర్జున్ తో డేటింగ్ కు వెళ్లేందుకు ఇష్టపడతానని.. స్టైలిష్ స్టార్ ను తాను విపరీతంగా అభిమానిస్తానని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.

అంతే కాదు.. బన్నీలో విపరీతమైన ఎనర్జీ ఉంటుందని.. ఆ ఎనర్జీ తనకు చాలా ఇష్టం అంటున్న శ్రీరెడ్డి.. మెంటాలిటీ ప్రకారం బన్నీకి తనకు చాలానే పోలికలు ఉంటాయని చెప్పి ఆశ్చర్యపరిచింది. అరవింద్2 వంటి సినిమాల్లో హీరోయిన్ నటించినా అంతగా గుర్తింపు సంపాదించుకోలేని ఈ భామ.. రీసెంట్ వివాదాలతో మాత్రం జనాల్లో బాగా నానుతోంది.
Tags:    

Similar News