ఏంటి.. శ్రీరెడ్డేనా ఈ పోస్టు పెట్టింది?

Update: 2018-06-21 04:31 GMT
కాస్టింగ్ కౌచ్ పై పోరాటమంటూ నటి శ్రీరెడ్డి బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్దల జాతకాలు బయటపెడతానంటూ మొదటి నుంచి రకరకరాల ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆమె ఇంతవరకు బయటపెట్టిన ప్రూఫ్ ఏదన్నా ఉందంటే దగ్గుబాటి సురేష్ రెండో కొడుకు అభిరామ్ తో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు మాత్రమే. అప్పట్లో అతడు తనకు అవకాశాలిప్పిస్తానంటూ మోసం చేశాడంటూ అతడిపై ఆరోపణలు చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశాక శ్రీరెడ్డి బాగానే చిక్కుల్లో పడింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తన వాయిస్ వినిపిస్తోంది. ఆమె ఎప్పుడు పోస్టులు పెట్టినా సురేష్ పేరు ప్రస్తావించాల్సి వస్తే ‘మామ’ అని... రానాను బావగారుగా వ్యంగ్యంగా సంబోధిస్తూనే ఉండేది. కానీ  మొదటిసారి ఆమె పద్ధతికి విరుద్ధంగా ఓ పోస్టు పెట్టింది. రానాను మొదటిసారి ‘సర్’ అంటూ చాలా మర్యాదపూర్వకంగా సంబోధించింది.  

రానా ఈ మధ్య కంటి సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ కు రెడీ అవుతున్నాడు. ఈనేపథ్యంలోనే శ్రీరెడ్డి పోస్టు పెట్టింది. ‘‘రానా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని తెలిసి చాలా బాధపడుతున్నా. అది చిన్నదే కావచ్చు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ’’ అంటూ శ్రీరెడ్డి పోస్టు పెట్టింది. శ్రీరెడ్డి వ్యవహార శైలికి చాలా భిన్నంగా ఉన్న ఈ పోస్టు చూసి నెటిజన్లు టాలీవుడ్ జనాలు చాలానే ఆశ్చర్యపోతున్నారు.
Tags:    

Similar News