మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. వారణాసి నుండి లేటెస్ట్ అప్డేట్!
కనీసం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అయినా.. సినిమా నుండి ఏదైనా గ్లింప్స్ విడుదల చేస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది వారణాసి. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఆఫ్రికన్ అడ్వెంచర్ అడవుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఎన్నో అంశాలు చేర్చుతున్నట్లు ఒక్కో హింట్ ఇస్తూ రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ సినిమా నుండి సరైన అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడో గత ఏడాది రామోజీ ఫిలిం సిటీ వేదికగా లక్ష మంది అభిమానుల సమక్షంలో గ్లోబ్ ట్రోటర్ పేరిట ఒక ఈవెంట్ ను నిర్వహించి.. అందులో సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ.. హీరో , హీరోయిన్, విలన్ పాత్రలను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అలా ఇందులో మహేష్ బాబు రుద్ర పాత్ర పోషిస్తుండగా.. కుంభ పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇక గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర పోషిస్తుంది. అలా ఈ ముగ్గురు పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు రాజమౌళి.
కనీసం మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అయినా.. సినిమా నుండి ఏదైనా గ్లింప్స్ విడుదల చేస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ రాజమౌళి అలాంటిదేమీ చేయకుండా మహేష్ బాబు లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆగస్టు 9వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో రాజమౌళి వారణాసి మూవీ నుండి రుద్ర క్యారెక్టర్ లో ఉన్న మహేష్ బాబు లుక్ ను రివీల్ చేస్తూ స్పెషల్ విషెస్ తెలియజేశారు
ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు." రుద్ర తన కంటే ఎంతో పెద్దదైన లక్ష్యాన్ని నెరవేర్చడానికే పుట్టాడు. తాను కోరుకోని విధిని ఇప్పుడు మోస్తున్నాడు. అతను చమత్కారి. సున్నితమైన మనసున్న వాడు.. అదే సమయంలో అత్యంత శక్తిమంతుడు కూడా" అంటూ రాజమౌళి తన హీరో పాత్రను వివరించారు.
అంతేకాదు రుద్ర పాత్రలో మహేష్ బాబు నటన గురించి కూడా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరైనా సరే శక్తివంతమైన పాత్రను పోషించగలరు. కానీ అదే సమయంలో శక్తిమంతంగా, సున్నితంగా కనిపించగలిగే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు అంటూ మహేష్ బాబు నటనపై కూడా ప్రశంసల కురిపించారు రాజమౌళి.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు చాలా అందంగా కనిపిస్తున్నారు అంటూ అభిమానులు, నేటిజన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు .. మొత్తానికి అయితే మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఎటువంటి గ్లింప్స్ విడుదల చేయకపోయినా ఆయన లుక్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఆఫ్రికా అడవుల్లో, కిలిమంజారో తో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు.