• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ అభిమానులతో...

పవన్ అభిమానులతో శ్రీరెడ్డి డిష్యుం డిష్యుం

By - Tupaki Desk
Update: 2018-12-24 14:08 GMT
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన ఆరోపణలతో కొన్ని నెలల పాటు హల్ చల్ చేసింది శ్రీరెడ్డి. ఐతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టిన ఘటనతో కథ అడ్డం తిరిగింది. శ్రీరెడ్డి మాటకు విలువ లేకుండా పోయింది. ఆ దెబ్బతో కొంత కాలం మౌనంగా ఉన్న శ్రీరెడ్డి.. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ కు చెందిన కొందరు సెలబ్రెటీల మీదా సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. టాలీవుడ్ సంగతి పట్టించుకోవడం మానేసింది. కానీ అప్పుడప్పుడూ ఆమె పవన్ కళ్యాణ్ ను మాత్రం టార్గెట్ చేస్తూనే ఉంది. పవన్ ఏ పని చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్న శ్రీరెడ్డి.. ఆయన రాజకీయ విషయాల పైనా దృష్టిసారించింది. తాజాగా జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించిన సంగతి తెలిసిందే.

ఓ వైపు పవన్ అభిమానులు ఈ గుర్తును జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా.. మరో వైపు శ్రీరెడ్డి ఆ గుర్తు పై సెటైర్లు గుప్పిస్తోంది. పవన్ పార్టీకి కేటాయించింది బీరు గ్లాసా.. వైన్ గ్లాసా.. స్కాచ్ గ్లాసా అంటూ ఆమె సెటైర్ వేసింది. అంతటితో ఆగకుండా పవన్ అన్నయ్య నాగబాబుకు కూడా ఒక గ్లాస్ ఇవ్వండర్రా అంటూ ఆమె సంచలన వ్యాఖ్య చేసింది. ఈ మధ్య నాగబాబుకు కొత్తగా గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ బాలయ్య ఎవరో తెలియదంటూ ఆయన చేసిన కామెంట్ మీద సెటైర్ వేసింది శ్రీరెడ్డి. ముందు నుంచే శ్రీరెడ్డి మీద మండిపోతున్న పవన్ అభిమానులకు తాజా వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయినా శ్రీరెడ్డి ఏమీ తగ్గకుండా వారితో ఫైటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలోనే ఉంటూ అక్కడ ఓ తమిళ సినిమాలో నటిస్తుండటం విశేషం. మకాం మార్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ను మాత్రం ఆమె వదలట్లేదు.
Tags:    
  • Sri Reddy 
  • Pawankalyan 
  • Janasena Party Symbol 
  • telugu News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS