• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పెషల్ స్టోరీ: అక్కల...

స్పెషల్ స్టోరీ: అక్కల బాటలో చెల్లెళ్ళు..!

By - Tupaki Desk
Update: 2022-06-21 01:30 GMT
బ్యాగ్రౌండ్ ఉంటే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అనేది ఈజీగా దొరుకుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే అది సరైన లాంచింగ్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైనా ఆ తర్వాత తమ టాలెంట్ ని నిరూపంచుకుంటేనే పరిశ్రమలో కొన్నాళ్లపాటు నిలబడగలుగుతారు.

పురుషాధిక్యత ఉన్న ఈ రంగంలో రాణించిన కొందరు నటీమణులు.. తమకున్న పరిచయాలతో తమ చెల్లెళ్లను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో అందం అభినయంతో వెండితెరపై ఓ వెలుగు వెలిగొందిన అక్కా చెల్లెల్లు ఉన్నారు. అలానే ప్రేక్షకులను మెప్పించలేక కొన్ని సినిమాలకే ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.

షావుకారు జానకి-కృష్ణకుమారి.. జయసుధ-సుభాషిణి.. భానుప్రియ-శాంతిప్రియ.. రాధిక-నిరోషా.. రాధ-అంబిక.. జ్యోతిలక్ష్మి-జయమాలిని.. నగ్మ-జ్యోతిక-రోషిని.. వనిత-శ్రీదేవి-ప్రీతి.. వంటి అక్కా చెల్లెల్లు దక్షిణాది చిత్రపరిశ్రమలో మెరిసారు. హిందీలో కరీనా కపూర్-కరిష్మా కపూర్.. శిల్పాశెట్టి- శమితా శెట్టి అలరించారు. నవతరం హీరోయిన్లు కూడా ఈ ట్రెండ్ ను కొనసాగిస్తూ తమ చెల్లెళ్లను రంగంలోకి దించుతున్నారు.

* మలయాళ 'ప్రేమమ్' సినిమాతో భాషతో సంబంధం లేకుండా యూత్ ని ఆకట్టుకున్న చెన్నై సుందరి సాయి పల్లవి.. 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా ఉన్న పల్లవి.. తన సోదరి పూజ కన్నన్ ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. 'కారా' అనే షార్ట్ ఫిలింతో మంచి పేరు తెచ్చుకున్న పూజా.. గతేడాది 'సిత్తిరాయ్ సెవ్వానమ్' అనే తమిళ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. పల్లవి చెల్లెలు ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తోంది.

* సీనియర్ నటీనటులు రాజశేఖర్-జీవిత దంపతులు తమ ఇద్దరు కుమార్తెలను కథానాయికలుగా పరిచయం చేసారు. 'దొరసాని' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక.. 'ఆనందం విలయడం వీడు' అనే సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం 'పంచతంత్రం' అనే మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది. 'అద్భుతమ్' తో హీరోయిన్ గా పరిచయమైన శివాని.. 'అన్బారివు' అనే తమిళ మూవీ చేసింది. ఈ క్రమంలో 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ' 'శేఖర్' సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం 'ఆహా నా పెళ్ళంట' వెబ్ సిరీస్ తో పాటుగా మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

* లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. 'క్రాక్' 'వకీల్ సాబ్' వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్న శృతి ప్రస్తుతం.. చిరంజీవి - బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. ప్రభాస్ తో కలిసి 'సలార్' మూవీ చేస్తోంది. మరోవైపు ఆమె సోదరి అక్షర హాసన్ 'షమితాబ్' సినిమాతో తెరంగేట్రం చేసింది. 'వివేకం' 'మిస్టర్ కెకె' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. త్వరలో 'జ్వాల' అనే పాన్ ఇండియా చిత్రంతో రాబోతోంది.
 
* అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తల్లి బాటలో 'ధడక్' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'గుంజన్ సక్సేనా' తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు 'గుడ్ లక్ జెర్రీ' చిత్రంతో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇక జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే 'ఆర్చీస్' అనే నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో నటిస్తోంది. త్వరలోనే బిగ్ స్క్రీన్ మీదకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

* '1 నేనొక్కడినే' చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించిన కృతి సనన్.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో వెలుగొందుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ఆదిపురుష్' చిత్రంలో జానకిగా నటిస్తోంది. ఇప్పుడు కృతి సోదరి నుపుర్ సనన్ సైతం ఇండస్ట్రీలో ఎంటర్ అయింది. 'నూరానీ చెహ్రా' తో కథానాయికగా మారిన నుపూర్.. ప్రస్తుతం రవితేజతో కలిసి 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా చేస్తోంది.

* 'మల్లీశ్వరి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కత్రినా కైఫ్.. కొన్నేళ్లపాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. త్వరలో 'ఫోన్ బూత్' 'మెర్రీ క్రిస్మస్' చిత్రాలతో పలకరించబోతోంది. కత్రినా బాటలో ఆమె సోదరి ఇసాబెల్లా కైఫ్ 'టైమ్ టు డ్యాన్స్' చిత్రంతో హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆయుష్ శర్మ తో కలిసి 'క్వాథ' అనే చిత్రంలో నటిస్తోంది.

* టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన కాజల్ అగర్వాల్ కూడా తన చెల్లెలు నిషా అగర్వాల్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే కొన్ని సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని.. పరిశ్రమకు దూరమైంది. ఇక పాండమిక్ టైంలో పెళ్లి చేసుకున్న కాజల్.. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె నటించిన 'ఉమ' సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

* అక్కా చెల్లెల్లు సంజన - నిక్కీ గల్రానీ కూడా హీరోయిన్లుగా సందడి చేశారు. సంజన ఇటీవల ఓ బిడ్డకు జన్మ నివ్వగా.. నిక్కీ గల్రానీ హీరో ఆది పినిశెట్టి ని వివాహం చేసుకుంది. రాధ కుమార్తెలు కార్తీక - తులసి కూడా కథానాయికలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే ఇద్దరూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు.
 
* కొన్నేళ్ళు టాలీవుడ్ ను ఏలిన దివంగత కథానాయిక ఆర్తి అగర్వాల్ తన సోదరి అదితి అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకొచ్చింది. 'గంగోత్రి' సినిమాలో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. సక్సెస్ కాలేకపోయింది. ఇక అక్కా చెల్లెల్లు షాలినీ - శామిలి కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Tags:    
  • Cinema Industry 
  • Tollywood 
  • Actress 
  • Actress Sisters 
  • Jayasudha-Subhashini 
  • Bhanupriya-Santhipriya 
  • Radha-Ambhika 
  • Specialstory 
  • Sisters Path 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS