మెగాస్టార్ మూవీలో విలన్ ఈయనేనా?
టాలీవుడ్ లో విలన్ గా ఎదురేలేని హవా సాగించాడు సోనూ సూద్. అటు బాలీవుడ్ లో నటిస్తూనే తెలుగు సినిమాలతో సౌత్ లో బాగా ఫేమస్ అయ్యాడు. నాగార్జున - మహేష్ - అల్లు అర్జున్ - ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు విలన్ గా కనిపించాడు సోనూ సూద్. అయితే తన కెరీర్ లో మరో అరుదైన అవకాశం దక్కింది. ఆ క్రమంలోనే అతడిలో ఎమోషన్ బయటపడింది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రం లో సోనుసూద్ విలన్ గా నటించనున్నాడు. ఆ అవకాశం దక్కినందుకు చిరుకి.. కొరటాలకు సోనూసూద్ కృతజ్ఞతలు చెబుతూ ఆనందం వ్యక్తం చేశాడు. చిరంజీవి సర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. సౌత్ పరిశ్రమ నన్ను బాగా దగ్గరకు తీసుకుంది. ఇక్కడ ఇంత ప్రేమను పొందినందుకు అంతే మొత్తంలో ప్రేమను తిరిగి ఇవ్వగలనని ఆశిస్తున్నాను. నటించడమే నా పని`` అంటూ కాస్త ఉద్వేగంగానే స్పందించాడు.
మెగాస్టార్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. ఇండస్ట్రీ లెజెండ్ గా ఆయన రేంజే వేరు. వెటరన్ లు ఎందరు ఉన్నా మెగా బాస్ ఛరిష్మానే వేరు. అందుకే సోనూసూద్ తాజా ఆఫర్ పై ఎంతో ఎగ్జయిటింగ్ గా స్పందించాడు. ఇక సోనూ కెరీర్ సంగతి చూస్తే... కన్నడలో `విష్ణువర్ధన` (2011).. తమిళంలో `రాజా` (2002).. తెలుగులో `హ్యాండ్స్ అప్` సోనూ కెరీర్ ఆరంభ చిత్రాలు. ఆ తర్వాత ఇంతింతై అన్న చందంగా ఎదిగాడు. తదుపరి అక్షయ్ నటిస్తున్న పృథ్వీరాజ్ అనే చిత్రంలో సోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాతోనే మిస్ ఇండియా మానుషి చిల్లర్ కథానాయికగా రంగ ప్రవేశం చేస్తోంది.