రాఘవ్ చద్దా షాకింగ్ కామెంట్స్...కేజ్రీవాల్ తో ఢీ ?
ఆప్ తరఫున ఒక యువ ఎంపీగా రాఘవ్ చద్దా తన గొంతుని రాజ్యసభలో బాగా వినిపిస్తున్నారు.;
ఆప్ తరఫున ఒక యువ ఎంపీగా రాఘవ్ చద్దా తన గొంతుని రాజ్యసభలో బాగా వినిపిస్తున్నారు. ఆయన ప్రజా సమస్యల మీద గొంతు ఎత్తుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల మీద కూడా విరుచుకుపడ్డారు. 28 రోజుల లెక్క ఏమిటి అని నిలదీశారు. ముప్పయి రోజులు కదా నెలా అనతవాకూ వాలిడిటీ ఇవ్వాలని కోరారు అలాగే ఒక రోజులో డేటా మిగిలిపోతే మరుసటి రోజుకు అడ్జస్ట్ చేయాలని కోరారు. అవుట్ గోయింగ్ కాల్స్ కి గడువు అయిపోతే ఇంకమింగ్ కాల్స్ ని ఎందుకు కంటిన్యూ చేయరని కూడా ప్రశ్నించారు. అంతే కాదు దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం, పితృత్వ సెలవులు, గిగ్ వర్కర్ల పని పరిస్థితులు ఇలా ఏ అంశం మీద అయినా ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు.
పదవి నుంచి తొలగింపు :
అలాంటి రాఘవ్ చద్దాను రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ పార్టీ తొలగించింది. ఆయనను ఒక సాధారణ ఎంపీగానే గుర్తించాలని కోరింది. దీంతో ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ యువ ఎంపీ బాగా పనిచేస్తున్నారు అని దేశంలోని మిడిల్ క్లాస్ యూత్ అంతా అట్రాక్ట్ అవుతున్నారు. అదే సమయంలో ఆయనని పదవి నుంచి తప్పించడం ఏంటని అంతా ఆశ్చర్యంగానే చూస్తున్నారు.
మౌనంగానే ఉన్నాను అంటూ :
ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమంలో రాఘవ్ చద్దా పెట్టిన ఒక పోస్టు అయితే ఆకట్టుకుంటోంది. తాను మౌనంగానే ఉన్నాను అని అయితే తాను ఎక్కడా ఓడిపోలేదు అని ఆయన ఆ పోస్టులో చెప్పుకొచ్చారు. మరి ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ పోస్టు పెట్టారు అన్నది కూడా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ రాఘవ్ చద్దా పిన్న వయసులోనే రాజ్యసభకు నెగ్గారు ఈయన ఒకనాడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. కాబట్టే ఈ పోస్టు దక్కింది. మరి ఆయన ఎందుకు కేజ్రీవాల్ కి దూరం అయ్యారు అన్నది కూడా చర్చగానే ఉంది.
అదే కారణమా :
అరవింద్ కేజ్రీవాల్ మీద అప్పట్లో ఒక్కర్ స్కాం ఆరోపణలు వచ్చాయి. ఆయన అరెస్టు అయినపుడు రాఘవ్ చద్దా విదేశాలలో ఉన్నారు. దాంతో ఆయన అరెస్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు, ఇంకో వైపు చూస్తే ఆ మధ్యనే క్రేజ్రీవాల్ జైలు నుంచి బాయ్టకు వచ్చారు అపుడు కూడా ఆయనను రాఘవ్ చద్దా కలవలేదు, ఇలా గ్యాప్ అయితే పెరుగుతూ వస్తోంది. ఎందుకు ఏమిటి అన్న కారణాలు ఎవరికీ తెలియవు కానీ అధినాయకత్వానికి రాఘవ్ చద్దాకూ మధ్య దూరం ఆయితే అంతకంతకు పెరుగుతూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆయనను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించారు అని అంటున్నారు. ఆప్ కి రాజ్యసభలో పది మంది ఎంపీలు ఉన్నారు అందులో ఢిలీ నుంచి ముగ్గురు ఉంటే పంజాబ్ నుంచి ఏడుగురు ఉన్నారు. రాఘవ్ చద్దాను పక్కన పెట్టడంతో ఆ పార్టీలో అధినాయకత్వానికి దూరం అయిన వారిలో రెండవ కీలక నాయకుడిగా రాఘవ్ చద్దా ఉన్నారు. మొదట స్వాతీ మాలివాల్ పార్టీకి దూరం అయ్యారు.
కారణం చెప్పాలని డిమాండ్ :
ఇక తాజాగా రాఘవ్ చద్దా పెట్టిన పోస్టులో పార్టీ తనను ఎందుకు పక్కన పెడుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఏ తప్పు చేశానో వివరించాలని ఆయన కోరారు. తాను ప్రజా సమస్యలనే రాజ్యసభలో లేవనెత్తుతున్నాను అని ఆయన చెప్పారు. ఏది ఏమైనా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతూ మధయతరగవి వర్గాల మద్దతు అందుకుంటున్న రాఘవ్ చద్దాను దూరం పెట్టడం ద్వారా ఆప్ తప్పు చేసిందా అన్న చర్చ కూడా సాగుతోంది.