సార్ తో మ‌ళ్లీ మ‌ళ్లీ అంటోన్న హాట్ బ్యూటీ!

మాలీవుడ్ ముద్దుగుమ్మ‌ సంయుక్త మీనన్ సౌత్ లో అన్ని భాష‌ల్ని దున్నేస్తోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-04-03 07:46 GMT

మాలీవుడ్ ముద్దుగుమ్మ‌ సంయుక్త మీనన్ సౌత్ లో అన్ని భాష‌ల్ని దున్నేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగ‌, త‌మిళం, మ‌ల‌యాళం అంటూ మూడు భాష‌ల్లోనూ బిజీగా కొన‌సాగుతుంది. వరుస విజ‌యాలు కూడా క‌లిసొస్తున్నాయి. దీంతో అమ్మ‌డు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన `సార్` చిత్రంలోనూ అమ్మ‌డు న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో టీచ‌ర్ పాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య‌ కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంయుక్త ధనుష్‌పై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని మ‌రోసారి చాటుకుంది.

`ధనుష్‌తో పని చేయడం త‌ను ఎంతో నేర్పించిందంది. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎన్నిసార్లు అయినా? ఎన్ని సినిమాలైనా చేయడానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలిపింది. ధనుష్ వంటి జాతీయ అవార్డు గ్రహీతతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఏ నటికైనా గర్వకారణమని ఆయన సెట్స్‌లో ఇచ్చే సలహాలు, నటనలో చూపే పరిణతి తనను ఎంతో ప్రభావితం చేసాయంది. `సార్` షూటింగ్ సమయంలో తమ మధ్య ఏర్పడిన బాండింగ్ చాలా ప్రత్యేకమైనదని గుర్తు చేసుకుంది. ధనుష్‌ను తాను ఒక మెంటార్ గా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

`ధనుష్ సర్ సెట్స్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన నటనను దగ్గరుండి చూడటం ఒక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. మ‌రి ఇంత‌లా పొగిడిన సంయుక్తా మీన‌న్ కు ధ‌నుష్ మ‌రో ఛాన్స్ ఇస్తాడా? లేదా? అన్న‌ది చూడాలి. సాధారణంగా ఒకసారి నటించిన హీరోతో మళ్ళీ వెంటనే అవకాశం రావడం అరుదు. మేక‌ర్స్ అదే కాంబినేన్ రిపీట్ చేయ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌రు. సంయుక్త మీనన్ కెరీర్ గ్రాఫ్ చూస్తే అమ్మ‌డు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. ప్ర‌త్యేకించి అమ్మ‌డు తెలుగులో మాత్రం తెలివైన గేమ్ ఆడుతోంది.

ఇంత వ‌ర‌కూ ఏ తెలుగు సినిమాలోనూ బోల్డ్ పాత్ర, గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించ‌లేదు. ఎంతో ప్రోపెష‌న‌ల్ న‌టిగానే హైలైట్ అయింది. కానీ మాలీవుడ్ లో మాత్రం అందుకు భిన్నంగా సినిమాలు చేస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో అక్క‌డ త‌న‌దైన ముద్ర వేసింది. అలాగ‌ని టాలీవుడ్ లో ఆత‌ర‌హా పాత్ర‌ల‌కు వ్య‌తిరేకం కాదు. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న‌ పాత్ర‌లు రావ‌డంతో? వాటికి దూరంగా ఉంటుంది. అవ‌స‌ర‌మైతే ఆ ర‌క‌మైన క‌థ‌న‌రంగంలో ఎప్పుడు దిగ‌డానికైనా సిద్దంగానే ఉంటుంది. ప్ర‌స్తుతం తెలుగులో `స్ల‌మ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` అనే చిత్రంలో న‌టిస్తోంది. నిఖిల్ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `స్వ‌యంభూ`లోనూ హీరోయిన్ గా న‌టిస్తోంది.

Tags:    

Similar News