జాబ్‌కే పరిమితం అవ్వొద్దంటున్న బాలీవుడ్ నటి
తన టాలెంట్ తో బాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్ మరోసారి తన అభిప్రాయాలతో వార్తల్లో నిలిచారు.;
తన టాలెంట్ తో బాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్ మరోసారి తన అభిప్రాయాలతో వార్తల్లో నిలిచారు. దంగల్ మూవీలో గీతా ఫోగట్ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె, ప్రస్తుతం తన కెరీర్ ఎంపికల విషయంలో స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, తనను నిజంగా ఆకట్టుకునేది ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమేనని, నటిగా ఎదగాలంటే సవాళ్లతో కూడిన కథలే అవసరమన చెప్పారు.
మన గురించి మనం తెలుసుకోవాలి
కమర్షియల్ ఫార్ములాకు మాత్రమే పరిమితం కాకుండా, కంటెంట్ ఆధారిత పాత్రలపై ఫాతిమా చూపుతున్న ఆసక్తి ఆమె కెరీర్ దిశను స్పష్టంగా తెలియజేస్తోంది. నటనలో వైవిధ్యం సాధించాలనే తపన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం కెరీర్ గురించే కాకుండా, జీవితం గురించి కూడా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎవరైనా కేవలం తమ ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాకూడదని, మన గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలు యూత్‌కు ఒక స్పష్టమైన మెసేజ్‌ను ఇస్తున్నాయి. వ్యక్తిగత అభివృద్ధి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.
ఫోటోగ్రఫీపై ఆసక్తి
ఇదిలా ఉంటే, నటిగా మాత్రమే కాకుండా మల్టీ టాలెంటెడ్ వ్యక్తిగా కూడా ఫాతిమా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారు. ఫోటోగ్రఫీపై తనకు ఉన్న ఆసక్తిని వెల్లడిస్తూ, కెమెరా ముందు నటించడం ఎంత ఇష్టమో, కెమెరా వెనుక ఉండటం కూడా అంతే ఇష్టమని చెప్పారు. షూటింగ్ గ్యాప్‌ల్లో ఫోటోగ్రఫీ చేస్తూ తన క్రియేటివిటీని పెంచుకుంటున్నానని ఫాతిమా తెలిపారు.
నటిని మాత్రమే కాదు.. మంచి కూతురు, స్నేహితురాలిని కూడా!
అలాగే తన వ్యక్తిత్వంలోని హ్యూమన్ సైడ్‌ను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. ప్రజలు తనను నటి ఫాతిమా సనా షేక్‌గా చూస్తారని, కానీ తాను ఒక మంచి కూతురు, మంచి స్నేహితురాలిని అని చెప్పిన ఆమె మాటలు అభిమానులకు మరింత దగ్గరయ్యేలా చేశాయి. స్టార్‌డమ్ ఉన్నప్పటికీ సాధారణ మనిషిగా ఉండాలనే ఆమె ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఫాతిమా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికొస్తే, ఫాతిమా త్వరలో థ్రిల్లర్ నేపథ్యంలోని టీన్ కౌవే అమెజాన్ ప్రైమ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొత్త తరహా కథలను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఆమె ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.