విదేశాల్లో సెటిల్.. ఇండియాపై సీనియర్ నటి లయ షాకింగ్ కామెంట్!

సీనియర్ నటి లయ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, పిల్లల పెంపకం గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Update: 2026-07-03 09:31 GMT

సీనియర్ నటి లయ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, పిల్లల పెంపకం గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడిన లయ.. తన అత్తగారి కుటుంబానికి దూరంగా ఉండటం, తన పిల్లలకు తెలుగు నేర్పించడంలో ఎదురవుతున్న అనుభవాలు, అలాగే తాను ఒంటరి సంతానం కావడం వల్ల పడిన ఎమోషన్స్ గురించి మనసు విప్పి మాట్లాడారు.

లాంగ్ డిస్టెన్స్ ఫ్యామిలీ లైఫ్:

నటి లయ ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో ఉంటున్నారు. అయితే ఆమె అత్తగారు, ఆడపడుచు, మరిది వాళ్లంతా ఓహాయోలోని కొలంబస్‌లో సెటిల్ అయ్యారు. "మేము చాలా దూరంలో ఉంటాము. అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లైట్‌లో రావాలంటే దాదాపు ఐదున్నర గంటలు పడుతుంది. టైం జోన్ కూడా మూడు గంటల తేడా ఉంటుంది. అయినా సరే ఏడాదికి ఒకటి రెండు సార్లు కలిసి బాగానే టైం స్పెండ్ చేస్తాం" అని లయ చెప్పుకొచ్చారు.

పిల్లల తెలుగు ముచ్చట్లు:

పిల్లలకు తెలుగు మాట్లాడటం రాదా? అన్న ప్రశ్నకు లయ చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. తన పిల్లలకు తెలుగు చదవడం, రాయడం, పద్యాలు చెప్పడం అన్నీ వచ్చు కానీ, మాట్లాడటానికి మాత్రం కాస్త భయపడతారని చెప్పారు. ఇక తప్పులు మాట్లాడేస్తామేమో అనే కాన్షియస్‌నెస్ వాళ్లలో ఎక్కువట. అందుకే వాళ్లను ఫోర్స్ చేయకుండా, ఆ భయం పోయాక వాళ్లే ఫ్రీగా మాట్లాడతారని లయ వదిలేశారట.

పెద్దన్నయ్య ఉంటే బాగుండు:

ఇంట్లో తాను ఒక్కరితే సంతానం కావడం గురించి లయ ఒక ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన ఫ్రెండ్స్‌కు ఉన్న అన్నయ్యలను చూసినప్పుడు తనకు కూడా ఒక పెద్దన్నయ్య ఉంటే ఎంత బాగుండో అని చాలాసార్లు అనిపించిందట. ఎవరైనా ఏమైనా అంటే ‘మా అన్నయ్య ఉన్నాడు చూసుకుంటాడు’ అనే ధీమా తనకూ ఉండాలని కోరుకునేదాన్ని అని లయ తన చిన్ననాటి కోరికను గుర్తుచేసుకున్నారు.

సిబ్లింగ్స్ బాండింగ్ పై ముచ్చట్లు:

తనకు తోబుట్టువులు లేకపోయినా.. ఇప్పుడు తన ఇద్దరు పిల్లలు కలిసి మెలిసి ఉండటం చూస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని లయ అన్నారు. ఇక ఫ్రెండ్స్ వాళ్ల అన్నయ్యలు తనను బాగానే చూసుకున్నప్పటికీ.. సొంత సిస్టర్‌ను చూసుకున్నంత ప్రొటెక్టివ్‌గా ఉండలేరు కదా అంటూ లయ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

విదేశాల్లో ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ, మన మూలాలను, భాషను మర్చిపోకుండా పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న లయ పెంపకంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఒక అన్నయ్య కావాలనుకున్న లయ చిన్నప్పటి ముచ్చట విన్న అభిమానులు 'భలే మాట్లాడారు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News