సౌత్ ఇండియా నుండి నేషనల్ అవార్డుకు సిద్ధమైన హీరోలు!

అల్లు అర్జున్ నుంచి మమ్ముట్టి, విక్రమ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలు ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వెలువడనున్న ఫలితాలపై అందరి కళ్లు ఉన్నాయి.

Update: 2026-07-03 12:30 GMT

భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈసారి ఉత్తమ నటుడి రేసులో సౌత్ ఇండియా హీరోల మధ్య పోటీ ఓ రేంజ్‌లో ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నానాటికీ పెరుగుతోంది. అల్లు అర్జున్ నుంచి మమ్ముట్టి, విక్రమ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలు ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వెలువడనున్న ఫలితాలపై అందరి కళ్లు ఉన్నాయి.

ఉత్కంఠ రేపుతున్న 72వ నేషనల్ అవార్డ్స్:

సినీ ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఈగర్‌గా ఎదురుచూసే జాతీయ చలనచిత్ర అవార్డుల సందడి మొదలైంది. ఇక 2024 సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారి వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. ఇక ప్రముఖ మలయాళ డైరెక్టర్ జయరాజ్ నేతృత్వంలోని జ్యురీ ఇప్పటికే ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

బరిలో నిలిచిన సౌత్ స్టార్స్:

ఈ ఏడాది ఉత్తమ నటుడి కేటగిరీలో టాలీవుడ్‌తో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో రేసులో ఉండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘భ్రమయుగం’ సినిమాతో, కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ చిత్రంతో పోటీ పడుతున్నారు. వీరితో పాటు అసిఫ్ అలీ మూవీ కిష్కింధ కాండం, సౌబిన్ షాహిర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ కూడా ఈ లిస్టులో ఉన్నారు.

బన్నీ హిస్టరీ రిపీట్ చేస్తారా?:

గతంలో ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకొని టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు అల్లు అర్జున్. ఇక ఇప్పుడు పార్ట్-2 అయిన ‘పుష్ప 2’తో మరోసారి బన్నీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసి, వరుసగా రెండోసారి కూడా నేషనల్ అవార్డును తన ఖాతాలో వేసుకుంటారా లేదా అన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మమ్ముట్టి, విక్రమ్ నుంచి గట్టి పోటీ:

అయితే ఈసారి అల్లు అర్జున్‌కు ఇతర భాషల నటుల నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. ముఖ్యంగా మమ్ముట్టి ‘భ్రమయుగం’ సినిమాలో చూపించిన అసాధారణమైన నటనకు గానూ ఇండస్ట్రీ వర్గాల్లో ఆయన పేరు గట్టిగా వినిపిస్తోంది. అలాగే ‘తంగలాన్’ కోసం విక్రమ్ పడిన కష్టం, మేకోవర్ కూడా అవార్డు తెచ్చిపెట్టేలా ఉన్నాయంటూ టాక్ నడుస్తోంది.

సౌత్ సినిమా స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా ప్రూవ్ అయిన తరుణంలో, ఈసారి నేషనల్ అవార్డు ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరి కొద్ది గంటల్లో తేలిపోనున్న ఈ రిజల్ట్స్‌లో మన టాలీవుడ్‌కు ఎన్ని అవార్డులు వస్తాయో, ఉత్తమ నటుడిగా ఎవరు నిలుస్తారో చూడాలి.

Tags:    

Similar News