ఇంటర్నెట్ షేక్ చేసిన సెలబ్రిటీ జంటలివే!
తమకు ఇష్టమైన స్టార్స్ పెళ్లి పీటలెక్కుతుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
తమకు ఇష్టమైన స్టార్స్ పెళ్లి పీటలెక్కుతుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోల కోసం సోషల్ మీడియాలో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఫోటోలు బయటకొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హంగామా సృష్టించిన బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ జంటల క్రేజీ వెడ్డింగ్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
టాలీవుడ్‌లో సెన్సేషన్.. విజయ్ - రష్మిక:
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవ్డ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఒక పెను సెన్సేషన్ సృష్టించింది. వీరు పెళ్లి బంధంతో ఒక్కటవుతూ షేర్ చేసిన ఫొటోలు టాలీవుడ్‌లోనే కాకుండా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యాయి. ఈ కపుల్ వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపి, ఫ్యాన్స్‌కు స్పెషల్ విజువల్ ఫీస్ట్‌గా మారాయి.
ట్రెండ్ సెట్టర్స్.. విరాట్ - అనుష్క:
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. ఇటలీలోని టస్కనీ వేదికగా జరిగిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల వివాహం సోషల్ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2017 డిసెంబర్‌లో రిలీజ్ అయిన వీరి పాస్టెల్ థీమ్ వెడ్డింగ్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.సెలబ్రిటీలు తమ పెళ్లి విషయాలను అధికారికంగా ఎలా ప్రకటించాలో ఈ జంటే ఒక ట్రెండ్ సెట్ చేసింది.
రాయల్ లుక్‌లో దీపికా - రణ్‌వీర్:
ఇటలీలోని లేక్ కోమోలో అత్యంత ప్రైవేట్‌గా జరిగిన దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ లవ్లీ వెడ్డింగ్ ఫొటోల కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేశారు. ఇక ఫస్ట్ పిక్ బయటకు రాగానే నెటిజన్లు లైకుల వర్షం కురిపించారు. వీరి రాయల్ లుక్స్, ట్రెడిషనల్ పిక్స్ చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి.
ఇండియన్ - వెస్ట్రన్ స్టైల్‌లో ప్రియాంక,నిక్ పెళ్లి అద్భుతంగా జరిగింది… హిందూ, క్రిస్టియన్ రీతుల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఇక జోధ్‌పూర్‌లో జరిగిన ఈ రాయల్ వెడ్డింగ్ విజువల్స్, విభిన్న ఆచారాలకు సంబంధించిన ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేశాయి.
సీక్రెట్ వెడ్డింగ్.. కత్రినా - విక్కీ!:
పెళ్లి రోజు వరకు ఎక్కడా ఎలాంటి సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తపడిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. రాజస్థాన్‌లో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఇన్స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు సాధించిన సెలబ్రిటీ వెడ్డింగ్ పోస్ట్‌లలో వీరి ఫొటోలు కూడా టాప్‌లో నిలిచాయి. అలాగే అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల సింపుల్ అండ్ బ్యూటిఫుల్ హోమ్లీ వెడ్డింగ్ పిక్స్ కూడా ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాయి.
డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయినా, ఇంట్లోనే చేసుకున్న సింపుల్ మ్యారేజెస్ అయినా.. ఈ సెలబ్రిటీల పెళ్లి ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇక వీటిని చూసినప్పుడల్లా అభిమానులు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ మురిసిపోతూనే ఉంటారు.