ధురంధర్ 2@ రూ.1500 కోట్లు.. మామూలు రికార్డులు కావు ఇవీ!

భారీ విజయాన్ని అందుకుని దూసుకెళ్తున్న ధురంధర్: ది రివెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది.;

Update: 2026-04-03 07:46 GMT

భారీ విజయాన్ని అందుకుని దూసుకెళ్తున్న ధురంధర్: ది రివెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఆ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే దేశీయంగా రూ.1000 కోట్ల నెట్ మార్క్‌ కు చేరువ కావడం విశేషం. అంతే కాదు రెండో వారం ముగిసే సరికి ఆ సినిమా భారత్‌ లో ఏకంగా రూ.961 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.




మొదటి వారంలో ధురంధర్ 2 రూ.690 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. రెండో వీకెండ్ లోనూ అదే ఊపు కొనసాగిస్తూ రూ.177 కోట్లు వసూలు చేసింది. వర్కింగ్ డేస్‌ లో కూడా కలెక్షన్లు స్టేబుల్ గా ఉండటం గమనార్హం. రెండో వారంలో సోమవారం రూ.26 కోట్లు, మంగళవారం రూ.28 కోట్లు, బుధవారం రూ.21 కోట్లు, గురువారం రూ.19 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.271 కోట్ల నెట్ సాధించింది.

ఇక భారత్‌ లో మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.1134 కోట్లకు చేరగా.. విదేశీ మార్కెట్లలో కూడా సినిమా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఓవర్సీస్‌ లో మొదటి రెండు వారాల్లోనే రూ.367 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1501 కోట్ల గ్రాస్ మార్క్‌ ను దాటింది. ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్ల వసూళ్లు సాధించడం అరుదైన ఘనత అని చెప్పాలి.

మొదటి వారం మొత్తం- రూ.690 కోట్లు (నెట్)

రెండో వారం మొత్తం – రూ.271 కోట్లు (నెట్)

ఇప్పటి వరకు ఇండియా మొత్తం- రూ.961 కోట్లు (నెట్)

భారత్‌ లో మొత్తం గ్రాస్ కలెక్షన్లు- రూ.1134 కోట్లు

ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు- రూ. 1,501 కోట్లు

అదే సమయంలో సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. హిందీలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అలాగే ప్రీవ్యూల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా గుర్తింపు పొందింది. ఓపెనింగ్ వీకెండ్ నుంచే భారీ కలెక్షన్లు సాధించిన ఆ సినిమా, తొలి వారం, రెండో వారం కలెక్షన్లలోనూ కొత్త రికార్డులు నెలకొల్పింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.1000 కోట్ల మార్క్ చేరిన భారతీయ చిత్రంగా నిలిచింది. రూ.100 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకు ప్రతి మైలురాయిని అత్యంత వేగంగా దాటిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. విదేశీ మార్కెట్లలో కూడా సినిమా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

అలాగే మొదటి వారంలోపే ఓవర్సీస్‌ లోనే అతిపెద్ద ఇండియన్ గ్రాసర్‌ గా రికార్డు సృష్టించింది. ధురంధర్ మొదటి భాగం మొత్తం వసూళ్లను 10 రోజుల్లోనే దాటేయడం విశేషం. ఏదేమైనా ధురంధర్: ది రివెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇదే జోష్ కొనసాగితే త్వరలోనే భారత్‌ లో రూ.1000 కోట్ల నెట్ మార్క్‌ ను కూడా అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తో ఆ చిత్రం మరిన్ని రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకెళ్తోంది.

Tags:    

Similar News