'సోలో బ్రతుకే..' ఇండస్ట్రీలో నూతనోత్సాహం తీసుకొచ్చినట్లేనా..?

Update: 2020-12-25 09:01 GMT
కరోనా మహమ్మారి కారణంగా కొన్నినెలల పాటు థియేటర్లు బంద్ అయిపోవడంతో ప్రేక్షకులు థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరమయ్యారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్స్ మల్టీప్లెక్సులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా భయంతో ఇప్పటివరకు కొత్త సినిమాలేవీ విడుదల కాలేదు. సగం సీటింగ్ కెపాసిటీతో రిటన్స్ వస్తాయా? అసలు ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? అనే అనుమానంతో నిర్మాతలెవరూ ధైర్యం చేయడం లేదని తెలుస్తోంది. అయితే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీ మేకర్స్ మాత్రం ధైర్యంగా ముందడుగేశారు.  

నూతన దర్శకుడు సుబ్బు రూపొందించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మించాడు. ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకున్న జీ స్టూడియోస్ వారు ముందుగా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి వెళ్లాలని అనుకున్నప్పటికి చివరకు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గుచూపారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కరోనా స్ట్రెయిన్ అనే కొత్త భయం ఆందోళన కలిగిస్తున్న సమయంలో ఈ సినిమా ఫలితం కోసం చిత్ర యూనిట్ మాత్రమే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే సోలో సినిమాకి ఆడియన్స్ నుంచి స్పందన వస్తుందో రాదో అని భయపడిన వారికి బుకింగ్స్ చూసి నూతనోత్సాహం వచ్చినట్లు తెలుస్తోంది. అలానే ఉదయం నుంచే ఈ సినిమా కోసం జనాలు థియేటర్స్ ముందు క్యూ కట్టారని అంటున్నారు.

థియేటర్స్ కి జనాలను రప్పించడానికి ఇండస్ట్రీ ప్రముఖులు తమ వంతు కృషి చేసారని చెప్పవచ్చు. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం ఇండస్ట్రీకే స్ఫూర్తిని ఇస్తుందని భావించి స్టార్ హీరో హీరోయిన్లు దర్శకులు నిర్మాణ సంస్థలు తన సొంత సినిమా అనుకొని ప్రచారం చేశారు. అందరి సపోర్ట్ తో ఇప్పుడు ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని చెప్పవచ్చు. సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుని కొన్ని రోజులు ఇలానే రన్ అయితే సాయి తేజ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లేనని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుం టున్నారు.
Tags:    

Similar News