తమ్ముడిని చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్విందట
తెలుగమ్మాయి శోభిత ధూళిపాల పరిచయం అవసరం లేదు. అడవి శేష్ గూఢచారి చిత్రంలో కథానాయికగా నటించింది. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో మంచి నటీమణులలో శోభిత ధూళిపాళ ఒకరు. రామన్ రాఘవ్ 2.0 - ఘోస్ట్ స్టోరీస్- మేడ్ ఇన్ హెవెన్ - బార్డ్ ఆఫ్ ది బ్లడ్ వంటి సినిమాలు .. వెబ్ సిరీస్ లతో ఆమె ఖ్యాతిని పొందింది. దక్షిణాదిన గూడాఛారి- మూతోన్ వంటి చిత్రాలలో నటించింది. అలాగే శోభితకు నేటివ్ ఫీలింగ్ కూడా ఎక్కువే. తెలుగు సినిమాకు పెద్ద అభిమాని. గతంలో అనేక ఇంటర్వ్యూలలో ఆ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ విషయంలో తన ప్రేమను చూపించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ చిత్రం తమ్ముడు గురించి శోభిత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తాను కడుపుబ్బా నవ్వుకున్నానని.. తెలుగు సినిమాలో లాగా ఎవరూ కామెడీ చేయరని ఆమె పేర్కొంది. సినిమాను మళ్లీ చూసిన తర్వాత శోభిత దాని గురించి ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. ``నిన్న రాత్రి తమ్ముడుని మళ్లీ చూసాను. తెలుగు సినిమా లాగా ఎవరూ ఎందుకు కామెడీ చేయరని గుర్తు చేసుకున్నాను. నేను చనిపోయాను (నవ్వుతూ ఎమోజి). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఫ్రిక్కిన్ కూల్. #గుడ్ ఓల్డ్ క్లాసిక్స్#90s ..``అని శోభిత రాసింది. శోభిత ప్రస్తుతం అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మేజర్ లో నటిస్తోంది. ఆమె తదుపరి విడుదల మలయాళ చిత్రం కురుప్. అటు హిందీలో వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.
తమ్ముడు చిత్రంలో పవన్ ఏ పనీ పాటా లేని పోకిరి కుర్రాడిగా కనిపిస్తారు. తనని ప్రేమిస్తున్న యువతిని కాదనుకుని క్లాస్ గాళ్ అతిథీ గోవిత్రీకర్ ని ప్రేమించి చివరికి ఝలక్ తింటాడు. చివరికి ఏమీ సాధించలేని అతడు తన అన్న కోసం బాక్సర్ అవుతాడు. చివరికి బలమయిన ప్రత్యర్థినే గెలుస్తాడు. ఇందులో ఫన్ ఆద్యంతం వర్కవుటయింది.