పవన్ కళ్యాణ్ భూమిక నడుము చూడనే లేదట!

Update: 2020-11-07 05:15 GMT
ఖుషి సినిమా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది నడుము సీనే. ఆ సినిమాలో  కథను మలుపు తిప్పేది ఆ సీనే. అప్పటిదాకా స్నేహితుల్లా  మెలుగుతూ వచ్చిన పవన్, భూమిక మధ్య నడుము వల్లే గొడవ మొదలవుతుంది. చీర కట్టుకుని భూమిక చదువుతూ కూర్చొని ఉండగా.. గాలి వీచిన ప్రతి సారి ఆ చీర పక్కకు వెళ్లడం.. పవన్ తదేకంగా నడుమును చూడటం జరుగుతుంది. దీంతో తన నడుము చూసావంటూ భూమిక పవన్ తో గొడవ పడుతుంది. అప్పటిదాకా క్లోజ్ ఫ్రెండ్స్ గా మెలుగుతూ వచ్చిన వారు ఆ ఒక్క సంఘటనతో ఒకరికొకరు దూరమవుతారు. అలా వారిద్దరూ దూరమైన తర్వాతే తమ మధ్య ఉన్నది గొడవ కాదని.. ప్రేమేనని గుర్తించి క్లైమాక్స్ లో మళ్లీ ఒకరికి ఒకరు దగ్గరవుతారు. నిజం చెప్పాలంటే ఖుషిలో  అసలు పెద్ద కథేమీ ఉండదు. కానీ అత్యంత ఆసక్తికరమైన కథనం ఉంటుంది.

సినిమా విడుదలై బంపర్ హిట్ అయిన తర్వాత.. చాలామంది సినిమా కథ ఏంటీ.. అని అడిగితే.. హీరోయిన్ నడుమును హీరో చూస్తాడని.. దీంతో హీరోయిన్ హీరోతో గొడవకు దిగుతుందని ఆ తర్వాత మళ్లీ ఒక్కటవుతారని చెబితే కథ అంతేనా.. అని ఆశ్చర్య పోయేవారు.  కానీ హీరో హీరోయిన్ల మధ్య ఆ ఒక్క చిలిపి గొడవ జనాలకు విపరీతంగా నచ్చింది. ఆ సినిమాలో నడుము సీనే హైలెట్.. దానిని వల్గర్ కు తావు లేకుండా దర్శకుడు ఎస్. జె. సూర్య చాలా చక్కగా తెరకెక్కించాడు. అప్పట్లో ఆ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. పవన్ ఇమేజ్ శిఖరాలను తాకింది. కాగా ఈ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ.. ' ఖుషి సినిమా అంటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది  ఆ సినిమాలోని నడుము సీనే. అయితే సినిమాల్లో చూపించినట్లుగా నిజంగా పవన్ కళ్యాణ్ భూమిక నడుమును  చూడలేదు. సినిమాలో పవన్, భూమిక  ఎదురెదురుగా కూర్చొని చదువుకునే సమయంలో భూమిక నడుము  కనిపించడం.. పవన్ చూడటం జరుగుతుంది. అయితే ఇందులో పవన్ ను ఓ టేబుల్ పై కూర్చొపెట్టి ఎదురుగా భూమిక కూర్చున్నట్లు, ఆమె నడుము చూస్తున్నట్లు నటించాలని కోరగా ఆయన అలాగే చేశారు. ఆ తర్వాత వేరుగా భూమిక సీన్లు షూట్ చేసి ఎడిటింగ్ లో వాళ్లిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నట్లు సన్నివేశాలను మార్చినట్లు' సూర్య  వెల్లడించారు.
Tags:    

Similar News