'మా'వాడిని క్షమించండి బాబోయ్

Update: 2017-05-23 12:29 GMT
ఇప్పుడు చలపతిరావు చేసిన కామెంట్లపై నాగార్జున ఖండించారు.. నాగచైతన్య కూడా ఖండించాడు.. అలాగే సంబంధం లేని ఇతర హీరోలు కూడా ఆయన్ను బాగానే తిట్టిపోశారు. అయితే ఈ మొత్తం యవ్వారాన్ని సింపుల్ గా ముగించాలని డిసైడైంది మూవి ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ముఖ్యంగా శివాజారాజా మరియు నరేష్‌ లు 'మా' తరుపున కాసినన్ని మంచి మాటలే చెప్పారు.

''చలపతిరావు గారు మాట్లిడిందే తప్పే. కాకపోతే దాన్ని ఆయనకు ఇండస్ర్టీతో ఉన్న లింక్ తో ముడిపెట్టి ఆయన మీద కేసులు పెట్టకండి. ఆయన మాట్లాడిన మాటలకు ఆయన టివి ఛానళ్ళ చుట్టూ తిరిగి క్షమాపణలు చెబుతున్నాడు. ఆ వయస్సులో పాపం ఆయనకు అలా జరిగింది. దయచేసి ఆయన్ను క్షమించి.. ఆయనపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోండి. ఆయనతరుపున 'మా' కూడా క్షమాపణలు చెబుతోంది'' అంటూ సెలవిచ్చారు ప్రెసిడెంట్ శివాజీ రాజా మరియు కార్యదర్శి నరేష్‌. అయితే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?

''ఇక మీద నుండి సోషల్ మీడియాలో కాని.. బయటెక్కడైనా కూడా.. నటులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖచ్చితంగా మా తరుపున చర్యలు తీసుకుంటాం. ఈ విషయాలన్నీ వారికి కూడా చెబుతాం. నటులందరితోనూ మాట్లాడతాం. ఇప్పటికైతే చలపతిరావును క్షమించండి'' అంటూ సెలవిచ్చారు. అది సంగతి.


Tags:    

Similar News