వేలెంటైన్ గిఫ్ట్: సింగిల్స్ ఆంథెమ్ మెంట‌లే

Update: 2020-02-14 05:15 GMT
యూత్ స్టార్ నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం భీష్మ‌. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే పోస్ట‌ర్లు.. లిరిక‌ల్ వీడియోలు ఫ్యాన్స్ లోకి దూసుకెళుతున్నాయి. ముఖ్యంగా మ‌ణిశ‌ర్మ వార‌సుడు మ‌హ‌తి సాగ‌ర్ స్వ‌ర‌ప‌రిచిన పాట‌లకు చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోంది. స్వ‌రాల హోరులో సాహిత్యం వినిపించ‌లేదు అన్న విమ‌ర్శ‌ కు తావివ్వ‌కుండా మ‌హ‌తి చ‌క్క‌ని క్లారిటీతో ట్యూన్ ని ఇవ్వ‌డం పెద్ద ప్ల‌స్ కానుంది.

ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకి థ‌మ‌న్ ఇలాంటి మ్యాజిక్ చేశాడు. రొటీనిటీని బ్రేక్ చేసి క్లారిటీతో సుస్వ‌రాల్ని అందించాడు. ఆ త‌ర్వాత భీష్మ పాట‌ల‌కు అంతే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుతోంది. తాజాగా భీష్మ సింగిల్స్ ఆంథెమ్ లిరిక‌ల్ వీడియో రిలీజైంది. ఈ సాంగ్ ఆద్యంతం మేకింగ్ సంథింగ్ స్పెష‌ల్ గా అల‌రించింది. నితిన్ ర‌క‌ర‌కాల గెట‌ప్పుల‌తో ఆక‌ట్టుకున్నాడు. స్కూల్ డేస్.. కాలేజ్ డేస్.. ఉద్యోగం చేసే రోజులు ఎప్పుడైనా బ్యాచిల‌ర్ స‌మ‌స్య అంతేగా! అన్న‌ట్టుగానే ఈ పాట‌ను డిజైన్ చేశారు. సింగిల్ బ్యాచిల‌ర్ తిప్ప‌లేమిటో క‌ళ్ల‌కు క‌ట్టారు. ముఖ్యంగా ఆ స్కూల్ డ్రెస్ ల‌లో అందాల భామ‌ల వెంట ప‌డే సింగిల్ భీష్మ ల‌వ‌బుల్ అనే చెప్పాలి. ప‌ర్ఫెక్ట్ ప్రేమికుల రోజు కానుక ఇది.

ప‌చ్చ చొక్కా.. బ్యాగీ ఫ్యాంటులో గిటార్ మీటుతూ రెట్రో లుక్ హైలైట్. ఆ లుక్ లో నితిన్ వేసిన ఆ ఒక్క స్టెప్పు యూత్ లో కిర్రాక్ పుట్టించ‌డం ఖాయం. సాంగ్ ఆద్యంతం ఒక ఎత్తు అనుకుంటే.. ఆ ఒక్క స్టెప్పు ఒక ఎత్తు. నితిన్ శోభ‌న్ బాబు రింగు ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ లేక అల్లాడిపోయే కుర్రాడి బాధ‌ల్ని శ్రీమణి చక్కగా వ‌ర్ణించారు. ఈ పెప్పీ నంబ‌ర్ ని అనురాగ్ కులకర్ణి అంతే ట్రెండీగా పాడారు.
Full View
Tags:    

Similar News