'అత్తారికింటికి దారేది' ని ఆగం చేసినట్లున్నాడుగా..!

Update: 2019-01-30 01:30 GMT
పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం టాలీవుడ్‌ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీ హిట్‌ ను అందుకున్న అత్తారికింటి దారేది చిత్రంను తమిళంలో 'వందా రాజాదా వరువేన్‌' అనే టైటిల్‌ తో శింబు హీరోగా దర్శకుడు సుందర్‌ రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. తమిళనాట భారీ అంచనాలున్న వందా రాజాదా వరువేన్‌ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ వచ్చింది. ట్రైలర్‌ చూస్తుంటే తెలుగు అత్తారింటికి దారేది ని ఉన్నది ఉన్నట్లుగా దించేసినట్లుగా అనిపిస్తుంది.

ట్రైలర్‌ లో సీన్స్‌ తెలుగు వర్షన్‌ లో ఉన్న మాదిరిగానే ఉన్నాయి. కాని శింబు యాక్షన్‌ మాత్రం కాస్త ఓవర్‌ యాక్షన్‌ లా అనిపిస్తోంది. శింబు తన ప్రతి సినిమాలో కూడా పావలాకు రూపాయి యాక్టింగ్‌ చేస్తూ ఉంటాడు. అదే విధంగా ఈ చిత్రంలో కూడా కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేసినట్లుగా అనిపిస్తోంది. ఈ ఓవర్‌ యాక్షన్‌ తో సినిమా ఫలితం తారు మారు అయ్యే అవకాశం కూడా ఉంది. అత్తారింటికి దారేది చిత్రంలో హీరో పాత్ర కాస్త అల్లరిగానే ఉంటుంది. కాని మొత్తం అల్లరి అల్లరి ఉంటే మాత్రం సినిమా మెయిన్‌ స్ట్రీమ్‌ దెబ్బ తినే అవకాశం ఉంది. త్రివిక్రమ్‌ చాలా జాగ్రత్తగా హీరో పాత్ర డిజైన్‌ చేశాడు. అంతకు మించి ఓవర్‌ యాక్టింగ్‌ చేస్తే మొదటికే మోసం వస్తుంది.

అజ్ఞాతవాసిలో పవన్‌ కళ్యాణ్‌ కొన్ని సీన్స్‌ లో అతి అల్లరి అయ్యింది. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ రీమేక్‌ లో శింబు ఓవర్‌ యాక్షన్‌ తో ఫలితం తారు మారు అయ్యే అవకాశం కూడా ఉందని - అత్తారింటికి దారేదిని శింబు తన అల్లరితో ఆగం చేస్తాడేమో అనిపిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వందా రాజాదా వరువేన్‌ చిత్రం సక్సెస్‌ శింబుకు ప్రస్తుతం చాలా కీలకం. మరి శింబుకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి

Tags:    

Similar News