జాన్వీ (X) కృతి: ఒక‌రు అనుమ‌తివ్వ‌క‌పోతే ఒక‌రు అనుమ‌తించార‌ట‌!

ఇటీవ‌లి కాలంలో సౌత్ వ‌ర్సెస్ నార్త్ డిబేట్ సోష‌ల్ మీడియాల్లో అంత‌కంత‌కు పెచ్చు మీరుతోంది. ఇది ఉత్త‌రాది, ద‌క్షిణాది హీరోయిన్ల పోలిక వ‌ర‌కూ వెళ్లింది.

Update: 2026-06-21 19:30 GMT

ఇటీవ‌లి కాలంలో సౌత్ వ‌ర్సెస్ నార్త్ డిబేట్ సోష‌ల్ మీడియాల్లో అంత‌కంత‌కు పెచ్చు మీరుతోంది. ఇది ఉత్త‌రాది, ద‌క్షిణాది హీరోయిన్ల పోలిక వ‌ర‌కూ వెళ్లింది. తాజాగా `పెద్ది` సినిమాలోని జాన్వీక‌పూర్ పాత్ర తీరుతెన్నుల‌తో పోలుస్తూ, `కాక్ టైల్ 2`లోని కృతి స‌నోన్ పాత్రను హైలైట్ చేయ‌ద‌లిచాడు ఓ ఉత్త‌రాది యూట్యూబ‌ర్. అయితే ఈ స‌మీక్ష‌లో అత‌గాడి ఉద్ధేశం సౌత్ ని సాధ్య‌మైనంత త‌గ్గించ‌డం..!! పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

ప్రముఖ యూట్యూబ్ ఫిల్మ్ క్రిటిక్ జేమీ ప్యాంట్స్ (అన్మోల్ జామ్వాల్) చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ముఖ్యంగా రెడ్డిట్ వేదికగా `పెద్ది` - `కాక్‌టైల్ 2` సినిమాల మధ్య పోలిక‌లు చూడ‌టానికి దారితీసింది. ఈ రెండు చిత్రాలలో హీరోయిన్లను చూపించిన విధానాన్ని పోలుస్తూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై జేమీ స్పందించారు. `కాక్‌టైల్ 2`లో నటి కృతి సనన్, షాహిద్ కపూర్ కాంబినేషన్ సీన్లలోని గ్లామర్‌ను...`పెద్ది` సినిమాలో జాన్వీ కపూర్ సీన్లతో పోల్చడంపై భిన్నమైన అభిప్రాయాలను అత‌డు రివ్యూ చేసాడు.

ఈ వివాదంలో జేమీ ప్యాంట్స్ ప్రధానంగా ఇరు సినిమాల‌ కథాంశం పరంగా ``అనుమ‌తితో చేసేప‌నికి .. వేధింపులకు`` మ‌ధ్య‌ ఉన్న వ్యత్యాసాన్ని చ‌ర్చించే ప్ర‌య‌త్నం చేసారు. `కాక్‌టైల్ 2` సినిమాలో కృతి సనన్ పాత్ర ఒక బీచ్ సీన్ లో షాహిద్ కపూర్ దృష్టిని ఆకర్షించడానికి ఎంతో ఇష్టంతో గ్లామర్‌ని ఆర‌బోస్తుంద‌ని.. ఇక్కడ పాత్రల మధ్య పూర్తి సమ్మతి లేదా అనుమ‌తి ఉందని విశ్లేషించాడు. కానీ `పెద్ది` సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర అనుమ‌తి లేకుండా అసభ్యంగా ప్రవర్తించడాన్ని రొమాన్స్‌లా చూపించడం తప్పు అని వాదించారు. `సమ్మోహనానికి`, `లైంగిక వేధింపులకు మధ్య చాలా తేడా ఉందని విశ్లేషించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే జేమీ వాదనతో కొందరు ఏకీభవించినా.. మెజారిటీ నెటిజన్లు మాత్రం వ్య‌తిరేకిస్తున్నారు. తెర‌పై కాకుండా, సినిమా సెట్ల‌లో ఉండే రియల్ వరల్డ్ ఏమిటో జెమీకి తెలుసా? అని ప్ర‌శ్నిస్తున్నారు. కథలో పాత్రకు సమ్మతి ఉన్నంత మాత్రాన క‌థానాయిక‌ను `వస్తువులా మార్చే విధానం` సరైనది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. కృతి సనన్ పాత్రకు ఆ ప‌ని ఇష్ట‌మే అయినా... కెమెరా కేవలం కృతి అంగాంగాన్ని ఆవిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించింద‌ని..ఒక ఉదాహ‌ర‌ణ‌గా..కృతి షార్ట్స్ విప్పేటప్పుడు వెన‌క భాగాన్ని చిత్రీక‌రించ‌డంపై ఫోకస్ చేయడం, చెస్ట్ జూమ్స్ పైనే దృష్టి పెట్ట‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇది పక్కా కమర్షియల్ ఉద్దేశంతో చేసిన గ్లామర్ ప్రదర్శనేనని వారు కౌంటర్ ఇస్తున్నారు.

సినిమాల్లో లైంగిక వేధింపులను లేదా బలవంతపు ప్రవర్తనను హీరోయిజం లేదా ప్రేమలాగా చూపిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని జెమీ విశ్లేషించే ప్ర‌య‌త్నం చేసినా... అత‌డి విశ్లేష‌ణ‌ను వ్య‌తిరేకించే వ‌ర్గం లేక‌పోలేదు. అమ్మాయి అనుమ‌తితో అయినా.. అంగాంగాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ గ్లామ‌ర‌స్ గా ఎలివేట్ చేయ‌డం క‌మ‌ర్షియాలిటీ కిందే లెక్క‌. అస‌లు కాక్ టైల్ 2 సినిమాలోని కృతి స‌నోన్ తో `పెద్ది` సినిమాలోని జాన్వీని ఎలా పోల్చి చూస్తారు?

ఉత్త‌రాది ఆడియెన్ హీరోయిన్ల‌ను ఎలా చూడ‌ద‌లిచారో అలా చూపించేందుకు `కాక్ టైల్ 2` ద‌ర్శ‌కుడు- ఛాయాగ్రాహ‌కుడు ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో `పెద్ది` సినిమాలో హీరోయిన్ ని ఒక ఉత్త్రరాంధ్రా మాస్ ఆడియెన్ లేదా బెజ‌వాడ బెంజి స‌ర్కిల్ మాస్ ఆడియెన్.. క‌రీంన‌గ‌ర్- వ‌రంగ‌ల్ కుర్రాళ్ల తీరును ఊహించుకుని ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు- ర‌త్న‌వేలు జోడీ ఊహించి ఉండొచ్చు క‌దా! అని ఎదురు ప్ర‌శ్నించారు. ఉత్త‌రాది ప్ర‌జ‌ల‌ సెన్సిబిలిటీ.. ద‌క్షిణాది ప్ర‌జ‌ల‌ సెన్సిబిలిటీ ఒక‌టే ఎందుకు అవుతుంది? అది ఉత్త‌రాది అయినా ద‌క్షిణాది అయినా .. మ‌హిళ‌ను అగౌర‌వ‌ప‌రుస్తూ ఒక వ‌స్తువులా చూపించాల‌నుకోవ‌డం త‌ప్పు అని స‌ద‌రు యూట్యూబ‌ర్ జెమీ విశ్లేషించాల్సింది. అలా కాకుండా వ‌న్ సైడెడ్ గా కాక్ టైల్ 2లో కృతి ఆర‌బోత‌ను స‌మ‌ర్థిస్తూ, పెద్దిలోని జాన్వీ గ్లామ‌ర్ విందును త‌ప్పు ప‌ట్ట‌డం స‌రికాద‌ని కూడా కొంద‌రు దుయ్య‌బ‌డుతున్నారు. ఒక సాధారణ యూట్యూబ‌ర్ త‌న స్టోరీకి మైలేజ్ పెంచుకునేందుకు ఇది ఒక ర‌క‌మైన పాకులాట అని కూడా త‌ప్పు ప‌డుతున్నారు! ఎవ‌రైనా ద‌ర్శ‌కుడు తాము టార్గెట్ చేసిన ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని స‌న్నివేశాలు రాస్తుంటారు త‌ప్ప అది వారి వ్య‌క్తిగ‌తం కాద‌నే విష‌యాన్ని కూడా స‌ద‌రు యూట్యూబ‌ర్ అర్థం చేసుకోలేక‌పోయాడ‌ని కూడా కొంద‌రు విమ‌ర్శించారు. పెద్ది చిత్రానికి ఉత్త‌రాదిన ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోయినా తెలుగు రాష్ట్రాలు స‌హా ద‌క్షిణాదిన చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించింద‌ని గుర్తు చేస్తున్నారు. కాక్ టైల్ 2 కి అంత సీన్ లేద‌ని కూడా దెప్పి పొడుస్తున్నారు.

Tags:    

Similar News