'లాట్స్ ఆఫ్ లవ్' అంటూ సలార్ బ్యూటీ స్పెషల్ పిక్!

Update: 2021-05-15 06:30 GMT
దక్షిణాది స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. గ్లామర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పదేళ్లుగా ఈ అమ్మడు అందాలను తెలుగు సినిమాల్లో ప్రదర్శిస్తూనే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలలో అవకాశాలు అందుకుంటుంది. డార్లింగ్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటిస్తున్న సలార్ సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ సాలిడ్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో లీడ్ హీరోయిన్ గా శృతిహాసన్ పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. మూడేళ్లు గ్యాప్ తీసుకొని రీఎంట్రీ చేసిన శృతికి అదృష్టం మాములుగా లేదు.

వచ్చిరాగానే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఈ విధంగా ఆలస్యం అయినప్పటికీ అమ్మడు ఇంకా ఫామ్ లోనే ఉన్నానంటూ గుర్తుచేస్తోంది. ప్రస్తుతం సలార్ తో పాటు శృతి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన లాభమ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో శృతి జానపద గాయనిగా కనిపించనుంది.

ఇదిలా ఉండగా.. శృతి సినిమాలలో అరుదుగా కనిపించవచ్చు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. ఎక్కువగా శృతి ఇంస్టాగ్రామ్ లో దర్శనమిస్తుంది. తాజాగా అమ్మడు ఓ స్పెషల్ పిక్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శృతిని చూస్తే కాస్తా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి కొంచం డిఫరెంట్ గా ట్రై చేసినట్లుంది. అందుకే బాగానే ముస్తాబైంది. కానీ కళ్లు చూస్తే పెద్దగా లెన్స్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మెడలో లవ్ సింబల్ లాకెట్ ఫ్యాన్స్ ను బాగా అట్ట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం శృతి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags:    

Similar News