చిరంజీవి-ఆమని కాంబినేషన్ అలా ఎందుకు జరిగింది?
మెగాస్టార్ చిరంజీవి దాదాపు అప్పటితరం హీరోయిన్లు అందరితోనూ కలిసి పని చేసారు. వారంతా క్రమం తప్పకుండా ఏడాదికోసారి తప్పకుండా రీయూనియన్ అవుతుంటారు.;
మెగాస్టార్ చిరంజీవి దాదాపు అప్పటితరం హీరోయిన్లు అందరితోనూ కలిసి పని చేసారు. వారంతా క్రమం తప్పకుండా ఏడాదికోసారి తప్పకుండా రీయూనియన్ అవుతుంటారు. అందుకు వేదిక చెన్నై , హైదరాబాద్ లో ఎక్కడైనా అవ్వొచ్చు. కానీ ఎంత బిజీగా ఉన్నా? ఏడాది లో ఓసారి మాత్రం కలుసుకోవడం మాత్రం పరిపాటే. ఇప్ప టికీ వారంతా మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు కాబట్టే సాధ్యమవుతుంది. కానీ ఈ గ్యాంగ్ లో అందాల ఆమని మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఈమె కూడా చాలా సీనియర్. చాలా మంది తెలుగు హీరోలతోనూ కలిసి పని చేసారు.
కానీ చిరంజీవితో మాత్రం పని చేయలేదు. కలిసి పనిచేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిన సందర్భం ఒకటుంది. అప్పటి నుంచి చిరంజీవితో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రాకపోవడంతో ఆమని మనసులో అదో కలగానే మిగిలిపోయింది. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా? ఎంత మంది స్టార్లతో కలిసి పనిచేసినా చిరంజీవి తో పని చేయకపోవడం మాత్రం తన కెరీర్ లో ఓ అసంతృప్తిగా ఆమని పేర్కొన్నారు. `చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఎంతో అభిమానించేదాన్ని...కానీ ఆయన పక్కన నటించాలి అన్న కోరిక మాత్రం కలగానే మిగిలిపో యిందన్నారు.
`శుభలగ్నం` తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కిన `రిక్షావోడు` సినిమాలో హీరోయిన్ గా తొలుత ఆమనిని ఎంపిక చేసారు. దర్శకుడు కోదండరామిరెడ్డి తో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. ఆమని డేట్లు కూడా ఇచ్చేసింది. షూటింగ్ ప్రారంభానికి ముందు ఆమని నేరుగా చిరంజీని కలిసి మాట్లాడటం జరిగింది. కానీ అనూహ్యంగా దర్శకుడిగా కొదండరామిరెడ్డి స్థానంలోకి కోడి రామకృష్ణ వచ్చారు. దీంతో ఆమనిని తప్పించి ఆమె స్థానంలో నగ్మను ఎంపిక చేసారని ఆమన మాటల్లో బయట పడింది. ఆ విషయం తనని ఎంతగానో నిరాశకు గురిచేసిందన్నారు.
అప్పటి నుంచి మళ్లీ చిరంజీవితో నటించే అవకాశం రాలేదన్నారు. ఇంత వరకూ ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు. తొలిసారి ఆమని ఓపెన్ అవ్వడంతోనే సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆమని టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాతో పాటు , సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. ఆమని కలను చిరంజీవి ఇప్పుడైనా పుల్ ఫిల్ చేయోచ్చు. ఇప్ప టికీ చిరంజీవికి సరిజోడీగా ఆమని సెట్ అవుతుంది. ఆమని వయసు 53 ఏళ్లు అయినా? ఇప్పటికీ అందే బ్యూటీని మెయింటెన్ చేస్తున్నారు. వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఆమని చాన్స్ విషయంలో చిరంజీవి స్టెప్ తీసుకుంటారా? అన్నది చూడాలి.