రవితేజతో ప్రేయసిగా చేసి ఇప్పుడు వదినగా..?

Update: 2023-01-01 05:11 GMT
హీరోయిన్లు కెరీర్ లో ఎప్పుడు ఎలాంటి ఛాన్స్ లు వస్తాయన్నది చెప్పడం కష్టం. టాలీవుడ్ లో దాదాపు కెరీర్ ముగిసింది అనుకున్న ఒక హీరోయిన్ మళ్లీ ఇక్కడ వరుస సినిమాలతో అదరగొడుతుంది. కమల్ గారాల పట్టి శృతి హాసన్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ అయ్యింది. సీనియర్ హీరోలు చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమాలు చేసిన శృతి హాసన్ ప్రభాస్ తో సలార్ సినిమాలో కూడా జత కట్టింది.

శృతి హాసన్ కి తెలుగులో ఇలా ఒకేసారి ఫ్యాన్సీ ఆఫర్స్ రావడం ఆమె ఫ్యాన్స్ కి కూడా షాక్ అయ్యేలా చేస్తుంది. సీనియర్ హీరోలతో జోడీ కట్టేందుకు కొందరు హీరోయిన్స్ ఆలోచిస్తారు కానీ శృతి మాత్రం అందుకు డేర్ చేసింది. ఇదిలా ఉంటే ఒకే హీరోతో ప్రేయసిగా, భార్యగా చేసిన శృతి హాసన్ ఇప్పుడు కొత్త సినిమాలో వదిన పాత్రలో నటించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే రవితేజ అని తెలుస్తుంది.

రవితేజ తో శృతి హాసన్ బలుపు, క్రాక్ సినిమాల్లో నటించింది. బలుపు సినిమాలో లవర్ గా నటించగా.. క్రాక్ లో భార్యగా చేసింది. అయితే ప్రస్తుతం చిరంజీవి హీరోగా చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో శృతి హాసన్ రవితేజకి వదిన పాత్రలో కనిపిస్తుందట. చిరంజీవి రవితేజ అన్నయ్య పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అలా చూస్తే శృతి హాసన్ రవితేజకి వదిన పాత్ర చేస్తున్నట్టు లెక్క.  

హీరోయిన్ కెరీర్ స్పాన్ లో సోలో ఛాన్స్ లు రాకపోతే వారు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయాల్సి వస్తుంది. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే శృతి హాసన్ ఇలా రవితేజకి వదిన పాత్రలో నటించడం షాక్ ఇస్తుంది. చిరు వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజకి జోడీగా కేథరిన్ త్రెసా నటించిందని తెలుస్తుంది. 2023 లో శృతి హాసన్ టాప్ లేపేయబోతుందని చెప్పొచ్చు. ఈ 3 సినిమాలు భారీ సినిమాలు కావడంతో తప్పకుండా శృతి హాసన్ మైలేజ్ పెంచేలా ఇవి ఉంటాయని చెప్పొచ్చు.
Tags:    

Similar News