ఐదేళ్ల ప్రణాళికతో బన్నీ బరిలోకా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం కోలీవుడ్ సంచలనం అట్లీ తో కలిసి ఓ పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తున్నాడు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం కోలీవుడ్ సంచలనం అట్లీ తో కలిసి ఓ పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తున్నాడు. బన్నీ కెరీర్ లో ఇది 22వ చిత్రం. ఈ చిత్రం ఇంటర్నేషనల్ మార్కెట్ లో సక్సెస్ అయిందం టే? బన్నీ రేంజ్ ఆకాశాన్నంటుతుంది. తెలుగు సినిమా నుంచి మరో గ్లోబల్ స్టార్ రెడీ అయినట్లే. మరి అందకు తగ్గట్టే బన్నీ ప్రణాళిక సిద్దం చేస్తున్నాడా? ఐదేళ్ల ప్లానింగ్ తో భవిష్యత్ ప్రాజెక్ట్ లు ప్లాన్ చేసుకుంటున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే అటు తిరిగి ఇటు తిరిగి చివరికి బన్నీ వద్దకే వచ్చింది త్రివిక్రమ్ మైథలాజికల్ స్క్రిప్ట్.
దీంతో బన్నీ కూడా లాక్ చేసి పెట్టేసాడు. తదుపరి ఈ సినిమానే పట్టాలెక్కుతుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని గురూజీ ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ నుంచి రిజెక్షన్ రావడంతో? గురూజీ మరింత సీరియస్ గా ఈ ప్రాజెక్ట్ పై పని చేయనున్నాడు. అతడు ఇంత వరకూ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించని నేపథ్యంలో? ఇదే తొలి సినిమా కావడంతో? కొడితే కుంభ స్తలాన్నే కొట్టాలి అన్నంత కసితో బరిలోకి దిగుతున్నాడు. అట్లీ సినిమా నుంచి బన్నీ రిలీవ్ అవ్వగానే ఈ చిత్రం కొద్ది గ్యాప్ లోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా? ఏడాదిన్నర సమయం పట్టొచ్చు.
మరోవైపు ఇప్పటి నుంచే కోలీవుడ్ పాన్ ఇండియా సంచలనం లోకేష్ కనగరాజ్ కు బన్నీ టచ్ లో ఉన్నాడు. `లియో`, `కూలీ` లాంటి చిత్రాలు వైఫల్యం చెందినా? ఆ రెండు 1000కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు. అతడికంటూ ఓ ఇమేజ్ ఉంది. దీంతో బన్నీ లోకేష్ ని ఎంత మాత్రం తక్కువ అంచనా వేయలేదు. తన కోసం రాసే కథ విషయంలో లోకేష్ ఎంత మాత్రం రాజీ పడడు అన్న కాన్పిడెన్స్ తో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా లోకేష్ కి టచ్ లో ఉంటున్నాడు బన్నీ. దీంతో ఈ కాంబినేషన్ మిస్ అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు.
అలాగే మరో యాక్షన్ సంచలనం సందీప్ రెడ్డి వంగతోనూ బన్నీ టచ్ లో ఉంటున్నాడు. `యానిమల్` రిలీజ్ అనం తరం సందీప్ హీరోల రేసులో బన్నీ పేరుందనే ప్రచారం అప్పటి నుంచి జరుగుతోంది. తాజాగా బన్నీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని సందీప్ తో ర్యాపోని మరింత పెంచుకుంటున్నాడు. సందీప్ కోసం టాలీవుడ్ నుంచే చాలా మంది హీరోలు క్యూలో ఉండటంతో? ఇప్పటి నుంచే బన్నీ కర్చీప్ వేస్తున్నాడు. `స్పిరిట్` సక్సెస్ అయితే? సందీప్ రేంజ్ నాలిగిందలు రెట్టింపు అవుతుంది. `స్పిరిట్` చిత్రాన్ని కూడా గ్లోబల్ స్థాయిలోనే ప్లాన్ చేస్తు న్నారనే ప్రచారం జరుగుతోన్న వేళ బన్నీకిది కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇలా బన్నీ 22 రిలీజ్ తర్వాత 2032 లోగా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్లు రిలీజ్ అయ్యేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు.