శృతి వాయిస్ లో తమన్నా అందాలు

Update: 2016-08-27 11:29 GMT
వినడానికి కాస్త కామెడీగా ఉన్నా కూడా.. అదే జరుగబోతోంది ఇప్పుడు. మిల్కీ బ్యూటి అందాలను మనం మరో సెక్సీ బ్యూటి గొంతులో చూడబోతున్నాం. అయితే ఇదంతా కాస్త కామెడీగా కన్ఫ్యూజింగా ఉంది కదూ.. పదండి ఆ విషయం ఏంటో తెలుసుకుందాం.

తమిళంలో హీరో విశాల్ కోసం ''కత్తి సండయ్'' అనే సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది మిల్కీ సైరన్ తమన్నా. ఈ సినిమాలోని పాటల్లో అమ్మడు దారబోసే అందాలు ఓ రేంజులో ఉంటాయని ఈ మధ్యనే షూటింగ్ స్పాట్ నుండి లీకైన ఫోటోలు చూస్తే మనకు అర్ధమైందిగా. ఇకపోతే ఈ పాటలను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరక్టర్ హిప్ హాప్ తమిళ.. ఇప్పుడు తమన్నా స్టెప్పులేసిన పాట ఫైనల్ వర్షన్ ను సెక్సిణి శృతి హాసన్ తో పాడిద్దాం అని ఫిక్సయ్యాడట. ఇటు విశాల్ అటు తమన్నాలకు మాంచి దోస్త్ అయిన శృతి.. వీరు అడగ్గానే వెంటనే ఒప్పేసుకుందట. ఆ విధంగా మన శృతి హాసన్ వాయిస్ లో హాటు పరువాలను ఆరబోస్తున్న తమన్నాను చూడొచ్చనమాట.

ఈ సినిమాను తెలుగులో కూడా ''ఒక్కడొచ్చాడు'' అనే పేరుతో రిలీజవుతోంది. మొత్తానికి ఇప్పటివరకు తెలుగులో తమిళంలో పాటలు కూడా పాడుతున్న శృతి హాసన్.. మరో పాటను ఈ సినిమా ద్వారా తన ఖాతాలో వేసుకుంది.
Tags:    

Similar News