మరో శంకర్ దాదా వచ్చే ఛాన్స్ కనిపిస్తోందే..
మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. థియేటర్లలో ఓ రేంజ్ లో సందడి మొదలవుతుంది. యాక్షన్ కు యాక్షన్.. డ్యాన్స్ కు డ్యాన్స్.. కామెడీకి కామెడీ.. ఏదైనా తనదైన స్టైల్ లో చేయగల టాలెంట్ ఆయన సొంతం.
మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. థియేటర్లలో ఓ రేంజ్ లో సందడి మొదలవుతుంది. యాక్షన్ కు యాక్షన్.. డ్యాన్స్ కు డ్యాన్స్.. కామెడీకి కామెడీ.. ఏదైనా తనదైన స్టైల్ లో చేయగల టాలెంట్ ఆయన సొంతం. ముఖ్యంగా చిరు కామెడీ టైమింగ్ కు ఇప్పటికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ వేరే లెవల్. మరి 70 ఏళ్లు దాటిన తర్వాత కూడా అదే జోష్ తో మరో శంకర్ దాదా లాంటి పాత్రలో మెగాస్టార్ కనిపిస్తే? అదిరిపోతుంది కదూ!
నిజానికి శంకర్ దాదా MBBSలో చిరు అల్లరి అంతా ఇంతా కాదు. సీరియస్ సిచ్యువేషన్ లోనూ నవ్వులు పూయించడం, డైలాగ్ చెప్పే విధానం, బాడీ లాంగ్వేజ్.. అన్నింటిలోనూ ఆయన మార్క్ కనిపించింది. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే ఎమోషన్ ఉండటంతో ఆ సినిమా స్పెషల్ గా నిలిచింది. అందుకే అలాంటి పాత్ర మరోసారి దక్కితే మెగాస్టార్ ఎలా సందడి చేస్తారనే ఇంట్రెస్ట్ అందరిలో ఉంది.
ఇప్పుడు ఆ టాపిక్ కు దర్శకుడు బుచ్చిబాబు సనా పేరు యాడ్ కావడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉప్పెన, పెద్ది సినిమాలతో తనదైన మేకింగ్ చూపించిన బుచ్చిబాబు.. చిరంజీవితో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. కాంబోపై మాత్రం చర్చ జరుగుతోంది. ఒక వేళ ఓకే అయితే చిరంజీవి కోసం బుచ్చిబాబు ఎలాంటి కథ రాస్తారన్నదే అసలు విషయం.
ఇప్పటివరకు ఆయన సినిమాల్లో ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపించింది. కానీ మెగాస్టార్ తో సినిమా చేస్తే మాత్రం స్టోరీని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ వైపు తిప్పే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. చిరు కామెడీ టైమింగ్, డ్యాన్స్, మాస్ మేనరిజమ్స్ ను కథలో భాగం చేస్తే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కంటే భిన్నంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
ఇక పెద్ది సక్సెస్ మీట్ లో చిరంజీవి, బుచ్చిబాబు మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. చరణ్ తో సినిమాలో చేయించిన కష్టమైన ఫైట్లు, వర్కౌట్లను తనతో కూడా చేయిస్తావా అంటూ చిరంజీవి నవ్వుతూ బుచ్చిబాబును ఆటపట్టించారు. తన వయసుకు తగ్గట్టుగా చూసి కథ రాయాలని కూడా చెప్పారు. ఆ కామెంట్స్ తో మెగాస్టార్ ను దృష్టిలో పెట్టుకుని బుచ్చి ఆలోచిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది.
అయితే చిరంజీవి తన లైనప్ లోని సినిమాలతో బిజీగా ఉండగా.. బుచ్చిబాబు కూడా కొత్త ప్రాజెక్టు కోసం స్టోరీ రాస్తున్నారు! కానీ వారి కాంబోలో మూవీ వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. అయితే ఒక విషయం మాత్రం క్లియర్. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ కు ఏజ్ అడ్డుకాదని ఆయన ప్రతి సినిమాలోనూ చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి కథ కుదరాలి.. దర్శకుడు ఆ ఎనర్జీని పట్టుకోవాలి. ఆ కాంబో సెట్ అయితే.. మరో కంప్లీట్ ఎంటర్టైనర్ రావడం ఖాయమే.