శర్వానంద్ కోసం శ్రీను వైట్ల కొత్త ఫార్ములా?
ఇప్పటివరకు ఎక్కువగా యాక్షన్, కామెడీ, హీరోయిజం చుట్టూ తన కథలను నడిపించిన ఆయన.. ఈసారి హీరో క్యారెక్టరైజేషన్‌కు సైంటిఫిక్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో తనదైన కామెడీ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శర్వానంద్‌తో చేస్తున్న జార్జ్ క్రిష్‌పై ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి శ్రీను వైట్ల తన రెగ్యులర్ ఫార్ములాకే మరో కొత్త టచ్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటివరకు ఎక్కువగా యాక్షన్, కామెడీ, హీరోయిజం చుట్టూ తన కథలను నడిపించిన ఆయన.. ఈసారి హీరో క్యారెక్టరైజేషన్‌కు సైంటిఫిక్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించినట్లు తెలుస్తోంది.
జార్జ్ క్రిష్‌లో శర్వానంద్ జూనియర్ సైంటిస్ట్‌గా కనిపించబోతున్నాడట. ఈ క్యారెక్టర్ ను కేవలం హీరో చేసే జాబ్ లాగా కాకుండా, కథలోని కీలకమైన అంశంగా డిజైన్ చేసినట్లు సమాచారం. మామూలుగా కమర్షియల్ సినిమాల్లో హీరోలను పోలీస్, గ్యాంగ్‌స్టర్, బిజినెస్‌మ్యాన్, మాస్ లీడర్ వంటి పాత్రల్లో చూడటానికి అలవాటు పడిన ఆడియన్స్ కు జూనియర్ సైంటిస్ట్ క్యారెక్టర్ కొత్త అనుభూతినిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సైంటిఫిక్ నేపథ్యాన్ని శ్రీను వైట్ల తనదైన ఎంటర్టైనింగ్ ట్రీట్‌మెంట్‌తో మిక్స్ చేస్తే ఎలాంటి సిట్యువేషనల్ కామెడీ పుడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
అంతేకాదు.. ఈ సినిమా కోసం శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడని ఇప్పటికే పలు వార్తలొచ్చాయి. సాధారణంగా మేకోవర్ అనగానే హీరో లుక్ మార్పుగా మాత్రమే చూస్తాం. కానీ జార్జ్ క్రిష్‌లో శర్వానంద్ లుక్ కూడా ఆయన పోషిస్తున్న జూనియర్ సైంటిస్ట్ పాత్ర స్వభావానికి తగ్గట్టుగానే ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమాలో హీరో ఇమేజ్ కంటే క్యారెక్టరైజేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ఇక శ్రీను వైట్ల గత సినిమాల్లో కనిపించిన కామెడీ ఎపిసోడ్స్, హీరో క్యారెక్టరైజేషన్, ఎంటర్టైనింగ్ ట్రాక్‌లకు ఈసారి సైంటిఫిక్ సెటప్‌ను జోడించడం ఆసక్తిని పెంచుతోంది. తన ఫార్ములాను పూర్తిగా మార్చకుండా.. అదే ఫార్ములాకు కొత్త ప్రపంచాన్ని సృష్టించారా అనే డిస్కషన్ కూడా మొదలైంది. శర్వానంద్ కోసం శ్రీను వైట్ల ఇలా ఒక కొత్త ఫార్ములాను సిద్ధం చేశారా అనేది సినిమా రిలీజయ్యే వరకు ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ షూటింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‌లో శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సేపై కీలకమైన లవ్ సీన్స్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.