నైజాంలో ప్యారడైజ్.. ఎన్ని రోజుల్లో రికార్డు బ్రేక్?
ముఖ్యంగా తెలంగాణలో ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. నైజాంలో దాదాపు రూ.25.96 కోట్ల షేర్ రాబట్టి నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ మార్క్ ను సెట్ చేసింది.
నేచురల్ స్టార్ నాని సినిమా అంటే నైజాంలో లెక్కే వేరు. సినిమా టాక్ బాగుంటే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో దసరా మూవీ ఇప్పటికే చూపించింది. ఇప్పుడు అదే నాని.. అదే శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ తో ది ప్యారడైజ్ గా వస్తున్నారు. దీంతో నైజాం బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట మొదలైనట్టే కనిపిస్తోంది. మరి దసరా బెంచ్ మార్క్ ను ప్యారడైజ్ ఎన్ని రోజుల్లో దాటుతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
2023లో వచ్చిన దసరా నాని కెరీర్ లోనే స్పెషల్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా తెలంగాణలో ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. నైజాంలో దాదాపు రూ.25.96 కోట్ల షేర్ రాబట్టి నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ మార్క్ ను సెట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజ్ నంబర్ కు దగ్గరగా వెళ్లినా.. ఆ రికార్డు మాత్రం అలాగే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు ది ప్యారడైజ్ వస్తోంది.
దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల మరోసారి చేతులు కలపడంతో మొదటి నుంచే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అనిరుధ్ రవిచందర్ సంగీతం కావడంతో హైప్ మరో రేంజ్ కు వెళ్లింది. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఆ సినిమాకు నైజాంలో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకు ఎగ్జాంపులే నైజాం హక్కుల ధర. ప్యారడైజ్ నైజాం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.37 కోట్లకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అంటే దసరాతో పోలిస్తే ఈసారి నాని సినిమా మార్కెట్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. భారీ బిజినెస్ జరిగిన నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర కూడా అదే రేంజ్ రన్ అవసరం కానుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఓపెనింగ్ పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో అడ్వాన్స్ టికెట్ సేల్స్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
దీంతో మొదటి రోజే నైజాంలో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక్కడ అసలు విషయం సినిమా టాక్ కూడా. కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే నైజాంలో వసూళ్లకు పండగే. సెప్టెంబర్ 24న రిలీజ్ అవుతున్న సినిమాకు దసరా సెలవులు కూడా కలిసి రానున్నాయి. దీంతో తొలి వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్ల జోరు కొనసాగించే అవకాశం ఉంటుంది.
అందుకే దసరా మూవీ రికార్డు ఎప్పట్లో బ్రేక్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రూ.25.96 కోట్ల షేర్ ను దాటడానికి ప్యారడైజ్ మూవీకి పెద్దగా సమయం పట్టకపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. సినిమా టాక్ స్ట్రాంగ్ గా ఉంటే తొలి వారంలోనే ఆ మార్క్ ను దాటే ఛాన్స్ ఉందని క్లియర్ గా తెలుస్తోంది. భారీ బిజినెస్, భారీ హైప్, పండగ సెలవులు.. ఇవన్నీ కలిసొస్తే నైజాంలో నాని కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పాలి.