రష్మిక ఫేక్ యాక్సెంట్.. సైలెంట్ గా ఇచ్చిపడేసినట్లే!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు చెబితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఆమెపై జరిగే డిబేట్లు కూడా గుర్తొస్తాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు చెబితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఆమెపై జరిగే డిబేట్లు కూడా గుర్తొస్తాయి. ఆమె ఏం మాట్లాడినా.. ఏ చిన్న మాట అన్నా.. అది వెంటనే వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు ఆమె మాట్లాడిన స్లాంగ్ కూడా అలాంటి చర్చకే కారణమైంది. అయితే ఈసారి రష్మిక ఇచ్చిన ఆన్సర్ మాత్రం ఆ ట్రోలింగ్ కు ఎండ్ కార్డ్ పడేలా చేసింది!
రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రష్మిక చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. అక్కడ ఆమె తెలంగాణ యాసలో మాట్లాడేందుకు ట్రై చేశారు. సరదాగా ఆమె చేసిన ఆ ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఆమె యాస నేచురల్ గా లేదని కామెంట్లు చేశారు. తెలంగాణ స్లాంగ్ ను కావాలని ఇమిటేట్ చేస్తున్నట్టుగా ఉందంటూ ట్రోలింగ్ కూడా మొదలైంది.
అయితే ఇదే సమయంలో రష్మికకు సపోర్ట్ గా నిలిచిన వాళ్లూ చాలామందే ఉన్నారు. కన్నడ అమ్మాయి అయినా తెలుగు సినిమాలు చేస్తూ భాషను నేర్చుకోవడం, లోకల్ స్లాంగ్ లో మాట్లాడేందుకు ట్రై చేయడం గ్రేట్ అని అన్నారు. యాసలో చిన్నచిన్న డిఫరెన్సులు రావడం కామనేనని కామెంట్లు చేశారు. నిజానికి ఒక లాంగ్వేజ్ మాట్లాడటం, ఆ భాషలోని ప్రతి ఏరియా స్లాంగ్ ను యాసను పక్కాగా పలకడం రెండు వేర్వేరు విషయాలు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి స్లాంగ్ మారుతుంటుంది. హైదరాబాద్, తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకే తెలుగు లాంగ్వేజ్ కు వేర్వేరు యాసలు కనిపిస్తాయి. అందుకే ఒక యాసను కొత్తగా అలవాటు చేసుకునే సమయంలో కొన్ని డిఫరెన్సులు రావడం సహజమే. ఇక ఆ చర్చ రష్మిక కొత్త సినిమా మైసా టీజర్ లాంచ్ ఈవెంట్ లోనూ ప్రస్తావనకు వచ్చింది.
అక్కడ ఆమెను యాస గురించి ప్రశ్నించగా.. ఎలాంటి ఇబ్బందికీ గురికాకుండా చాలా కూల్ గా రెస్పాండ్ అయ్యారు తాను మాట్లాడే యాస ఏదైనా.. తాను చెప్పాలనుకున్న విషయం ఎదుటివాళ్లకు అర్థమవుతోందా లేదా అన్నదే ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేశారు. తన మాటల్లో చిన్న పొరపాటు ఉందా, యాస పక్కాగా వచ్చిందా అనే దానిపై కాకుండా.. తాను చెప్పాలనుకున్న ఫీలింగ్ జనాలకు చేరుతోందా అన్న విషయానికే ఆమె ఇంపార్టెన్స్ ఇచ్చారు.
సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా ఫోకస్ ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా, లుక్, మాట తీరు, యాస.. ఇలా ప్రతి విషయంపైనా కామెంట్లు రావడం ఇప్పుడు కామన్ గా మారింది. అయితే ప్రతి విషయాన్నీ పెద్ద వివాదంగా మార్చాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ కూడా మరోవైపు వినిపిస్తోంది. రష్మిక విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు చేసిన చిన్న ప్రయత్నం ట్రోలింగ్ కు దారితీసింది. కానీ ఆమె మాత్రం చాలా సింపుల్ గా, సైలెంట్ గా ఇచ్చిపడేశారు!