• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: బ్యూటిఫుల్...

ఫోటో స్టొరీ: బ్యూటిఫుల్ లేడీ గబ్బర్ సింగ్

By - Tupaki Desk
Update: 2019-06-24 05:30 GMT
తండ్రి కమల్ హాసన్ లాగే శృతి హాసన్ కూడా మోడరన్ థింకింగ్ ఉండే వ్యక్తి.  జనాలేమనుకుంటారో అని ఊరుకోకుండా తనకు నచ్చిన పని చేసేస్తుంది.  అందుకే కెరీర్ లో పీక్స్ లో ఉండే సమయంలో లవ్ లో పడడం.. సూపర్ కెరీర్ ను వదిలేసి ఇంటర్నేషనల్ సింగర్ గా మారేందుకు లండన్ కు మకాం మార్చడం చేయగలిగింది. అటు లవ్వు .. ఇటు సింగింగ్ కెరీర్ అనుకున్నట్టు సాగకపోవడంతో మళ్ళీ ఇండియా కు తిరిగొచ్చి హీరోయిన్ కెరీర్ కొనసాగిస్తోంది.  బ్రేకప్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడేసి తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది.

శృతి సినిమాలు చేసినప్పుడు.. గ్యాప్ ఇచ్చిన సమయంలోనూ.. ఎప్పుడైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది.  రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉండేది.  అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావడంతో శృతిపై జనాల ఫోకస్ కాస్త ఎక్కువైంది అంతే.  తాజాగా శృతి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "బ్లాక్ అనేది లేని రోజు.. అసలు ఇదెలా జరిగిందబ్బా." శృతికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం. మరి అలాంటి భామ బ్లాక్ అనేది లేకుండా లైట్ పింక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని పోజిచ్చింది. చేతికి పెట్టుకున్న వాచ్.. వేళ్ళకు పెట్టుకున్న ఉంగరాల్లో కూడా బ్లాక్ కలర్ కనపడడం లేదు. లిప్ స్టిక్ కూడా పింక్. అందుకే తనకు తానే సర్ ప్రైజ్ అయినట్టుంది. ఏదైతేనేం.. ఈ ఫోటోలో మునుపటిలా స్లిమ్ముగా.. స్టైలిష్ గా ఉంది.  మంచి స్మైల్ తో పోజిచ్చింది.

అందుకే నెటిజన్లు ఈ ఫోటోకు తమ లైకులతో జేజేలు పలికారు. "బ్లాక్ ఎందుకు బ్యూటీ.. పింక్ లో క్యూట్ గా ఉన్నావు".. "సూపర్ స్టార్ హీరోయిన్".. "క్యూట్ బ్యూటీ క్వీన్".. "బ్యూటిఫుల్ లేడీ గబ్బర్ సింగ్" అంటూ కామెంట్లు పెట్టారు.  ప్రస్తుతం శృతి విజయ్ సేతుపతితో  'లాబం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో 'పవర్' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు.
Tags:    
  • Shruthi Hassan 
  • Actress Shruthi Hassan 
  • Latest News 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS