• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శీనయ్య కోసం సూపర్ హాట్...

శీనయ్య కోసం సూపర్ హాట్ సీనియర్ బ్యూటీ ?

By - Tupaki Desk
Update: 2019-11-23 08:46 GMT
వివాహం ముందు వరకూ వరస సినిమాల తో హోరెత్తించిన శ్రియ మిసెస్ ఆండ్రీ కోస్చీవ్ గా మారిన తర్వాత స్పీడ్ తగ్గించింది.  దాంతో పాటుగా కొత్త తరం కథానాయికల రాక తో శ్రియ డిమాండ్ కొంత తగ్గింది.  అలా అని పూర్తిగా అవకాశాలు తగ్గిపోలేదు.  చేతిలో ఇప్పటికీ సినిమాలు ఉన్నాయి.  కొత్త ఆఫర్లు కూడా వస్తూనే ఉన్నాయి.  తాజాగా వివి వినాయక్ డెబ్యూ సినిమా 'శీనయ్య' లో శ్రియను హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఇప్పటికే శ్రియ ను సంప్రదించారని.. శ్రియ కూడా ఫార్మల్ గా తన పచ్చజెండా ఊపేసిందని సమాచారం.  పారితోషికం విషయంలో అంగీకారం కుదిరితే వినాయక్ తో రొమాన్స్ కు రెడీ అయినట్టే.  మ్యారేజ్ తర్వాత శ్రియ పెద్దగా సినిమాలు సైన్ చెయ్యలేదు.  దీంతో అభిమానులు కొంత నిరాశపడిన మాట వాస్తవమే.  అయితే ఇప్పుడు మాత్రం శ్రియ వద్దకు పలు ఆఫర్లు వచ్చాయని త్వరలోనే కొత్త సినిమాల ప్రకటన ఉంటుందని తెలియడంతో అభిమానులకు ఇది సంతోషకరమైన వార్తే.  అయితే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కాకుండా వినాయక్ లాంటి లేటు వయసు డెబ్యూ హీరో సరసన హీరోయిన్ అనగానే కొందరు పెదవి విరుస్తున్నారు.  శ్రియ తన కెరీర్ ఆరంభం నుంచి ఇలాంటివి పట్టించుకోలేదు.  తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే  శ్రియ తమిళ కమెడియన్ వడివేలు సినిమాలో ఆయనకు జోడీగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది.  అంతే కాదు.  పలు చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా నటించి తనకు సినిమాల విషయంలో పెద్ద చిన్న తేడాలు లేవని నిరూపించింది.  అందుకే వినాయక్ తో జోడీ కట్టడం పెద్దగా షాక్ ఇచ్చే అంశమేమీ కాదు.

ఈమధ్య శ్రియ పేరును మెగాస్టార్ చిరంజీవి నటించబోయే #చిరు152 సినిమా కు.. వెంకటేష్ నటించనున్న 'అసురన్' రీమేక్ లో హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన రాలేదు.  ఒకవేళ ఈ సినిమాల్లో కూడా ఆఫర్ వస్తే మాత్రం పెళ్ళి తర్వాత కూడా శ్రియ కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్నట్టేనని అనుకోవాలి.
Tags:    
  • Shriya Saran To Act With Vv Vinayak 
  • Shriya Saran 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS