నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల పరువాలు

Update: 2023-05-06 12:43 GMT
2001వ సంవత్సరంలో 'ఇష్టం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రియ శరన్. మొదటి సినిమాతోనే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే టాలీవుడ్ కింగ్ నాగార్జున కు జోడిగా సంతోషం అనే సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

సంతోషం సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించి మరో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అదే సంవత్సరం నువ్వే నువ్వే సినిమాలో తరుణ్ కి జోడిగా నటించి మరో విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. వరుసగా నాలుగు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న శ్రియ కి 2003 వ సంవత్సరంలోనే మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా ఠాగూర్ చిత్రంలో నటించే అవకాశం దక్కింది.

ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ గా సినిమాలు తగ్గినా కూడా  ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు అలరించే అందాల ఆరబోత ఈమె అభిమానులకు సర్ప్రైజ్ చేస్తూనే ఉంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు అందరిని సప్రైజ్ చేస్తున్నాయి. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నాలుగు పదుల వయసులో అడుగు పెట్టింది.

నాలుగు పదుల వయసు లోనూ పాతికేళ్ల పరవాలతో అలరిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందాల ముద్దుగుమ్మ కు అవకాశాలు మరిన్ని రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Similar News