బాంబు పేల్చిన కాజల్ కమల్ ఇండియన్-2పై షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ఇప్పుడు మంచు విష్ణు నటించిన 'మోసగాళ్లు' ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొనడంతోపాటు పలు ఇంటర్వ్యూలకూ అటెండ్ అవుతోంది. కాగా.. ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్.. కమల్ హాసన్ - శంకర్ కాంబోలో రాబోతున్న భారతీయుడు - 2 చిత్రానికి సంబంధించి ఊహించని బాంబు పేల్చారు!
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ భారీ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రానికి రీమేక్ ప్లాన్ చేశారు దర్శకుడు శంకర్. దాదాపు 200 కోట్ల వ్యయంతో షూట్ కు బయల్దేరిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే.. నిర్మాతలతో బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్ కు వివాదం తలెత్తడంతో కొంత కాలం సినిమా ఆగిపోయింది.
ఆ తర్వాత పట్టాలెక్కినప్పటికీ.. గతేడాది సెట్లో భారీ యాక్సిడెంట్ సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కరోనా తీవ్రమవడం.. లాక్ డౌన్ వంటివన్నీ జరిగిపోయాయి. దీంతో ఈ సినిమా షూట్ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే.. ఈ విషయమై తాజాగా మాట్లాడిన కాజల్ షాకింగ్ న్యూస్ చెప్పారు.
ఇండియన్-2 మూవీ ఆగిపోయిందంటూ బాంబు పేల్చారు. వాస్తవానికి అన్నీ సర్దుకున్న తర్వాత ఈ సినిమా పునః ప్రారంభం అవుతుందని భావించినప్పటికీ అది జరగలేదు. ఇటీవల శంకర్-రామ్ చరణ్ కాంబోలో మూవీ అనౌన్స్ చేయడంతో ఇండియన్-2 పక్కకు వెళ్లినట్టేనా? అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు కాజల్ ప్రకటనతో పిక్చర్ క్లియర్ అయ్యింది.
అయితే.. ఇండియన్-2కు మెజారిటీ టెక్నీషియన్స్ అమెరిక్ ను చెందిన వారు ఉన్నారు. అక్కడ ఇప్పుడు కరోనా తీవ్రంగానే ఉంది. కాబట్టి వారు ఎప్పుడు ఫ్రీ అవుతారో తెలియదు. ఇటు నిర్మాతలతో వివాదం ఉండనే ఉంది. మరోవైపు శంకర్ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. కాబట్టి.. ఇక భారతీయుడు-2 అనే సినిమా శాశ్వతంగా ఆగిపోయినట్టేనా? మళ్లీ మొదలయ్యే అవకాశం ఉందా? అన్నది ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేని విషయంగానే మిగిలిపోయింది.