నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపుతో చిన్న సినిమాల‌కు షాక్

Update: 2021-08-17 10:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌రోసారి రాత్రిపూట క‌ర్ఫ్యూని పొండిగించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 21 వ‌ర‌కూ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది. యాధావిధిగా అనుమ‌తులు ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే. ఆ త‌ర్వాత‌ ఆంక్ష‌లు వ‌ర్తిస్తాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఈనెల 20న రిలీజ్ అయ్యే సినిమాల‌పై ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. నైట్ క‌ర్ఫ్యూ నుంచి మిన‌హ‌యింపులు ఉంటాయ‌న్న కార‌ణంగా కొంత మంది చిన్న నిర్మాత‌లు త‌మ సినిమాల్ని రిలీజ్ డేట్ల‌ను లాక్ చేసి పెట్టుకున్నారు. థ‌ర్డ్ వేవ్ తో ఇప్ప‌ట్లో అంత‌గా భ‌యం లేదు. పైగా తెలంగాణ‌లో ఆంక్ష‌లు లేని కార‌ణంగా ఏపీలో కూడా నైట్ క‌ర్ఫ్యూ ఉండ‌ద‌ని భావించారు.

కానీ ఏపీ ప్ర‌భుత్వం ఊహించ‌ని విధంగా షాక్ ఇచ్చింది. అంటే కేవ‌లం మూడు షోల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. నాల్గ‌వ షో అసాధ్య‌మ‌ని తేలిపోయింది. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతోనేనే సినిమాలు ఆడించాల్సి ఉంటుంది. ఆ ర‌కంగా చిన్న నిర్మాత‌ల నెత్తిపై పిడుగు ప‌డింది. అయితే అవేవి భారీ బ‌డ్జెట్ సినిమాలు కాదు...పెద్ద స్టాయి న‌టులున్న సినిమాలు కూడా కాదు. ఈ సినిమాలన్నింటిలో చెప్పుకోద‌గ్గ సినిమా ఏదైనా ఉందా అంటే బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టించిన `బ‌జారు రౌడీ` మాత్ర‌మే. ఈ సినిమానే జ‌నాల్ని కాస్త ఎంట‌ర్ టైన్ టైన్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కి కూడా సంపూకి బాగానే ఉంది కాబ‌ట్టి మూడు షోలు స‌క్ర‌మంగా ప‌డితే సంపూ గ‌ట్టెక్కిన‌ట్లే.

ఇంకొన్ని మీడియం బ‌డ్జెట్ సినిమాలో అర‌కొర‌గా రిలీజ్ అయి ఆడుతున్నాయి. మ‌రికొంత మంది స్టార్లు ఓటీటీ రిలీజ్ కు ల‌కు వెళ్లిపోయారు. ఇక అగ్ర హీరోలంతా ద‌స‌రా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి డేట్ల‌ను లాక్ చేసి పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రాకి `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ చేయాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నారు. ఇక సంక్రాంతికి `భీమ్లా నాయ‌క్`...స‌ర్కారు వారి పాట‌..రాధేశ్యామ్.. ఎఫ్ 3 రిలీజ్ కానున్నాయి. మ‌రిన్ని సినిమాలు ఈ సీజ‌న్ లో రిలీజ్ ల‌కు డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాయి.

క్రైసిస్ తెచ్చిన తంటా అంతా ఇంతా కాదు!

ఇక‌పోతే చిన్న సినిమాల కోసం ప్ర‌త్యేకించి ఐదో షోని కేటాయించాల‌ని ఏపీ - తెలంగాణ ప్ర‌భుత్వాల‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత న‌టుడు నిర్మాత ఆర్.నారాయ‌ణ‌మూర్తి డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్న నిర్మాత‌ల శ్రేయ‌స్సు కోసం ఆయ‌న ఇటీవ‌లి ప‌రిశ్ర‌మ కీల‌క భేటీల్లో పాల్గొంటున్నారు. చిన్న సినిమా మేలు కోసం ఆయ‌న త‌న వాద‌న వినిపిస్తున్నారు. ఇటీవ‌ల చిరంజీవి ఇంట జ‌రిగిన భేటీలోనూ నారాయ‌ణ‌మూర్తి త‌న బాణీ వినిపించారు. కానీ ఇప్పుడున్న క్రైసిస్ లో ఇది సాధ్య‌మ‌య్యేదేనా? ఇప్పటివ‌ర‌కూ ఏపీలో నాలుగో షోకే అవకాశం లేదు. ఇక ఐదో షో కూడా వేస్తారా? అన్న చ‌ర్చా సాగుతోంది. అయితే ఆయ‌న డిమాండ్ మేర‌కు ప్ర‌భుత్వాలు అంగీక‌రిస్తే కోవిడ్ అనంత‌రం ఐదో షో చిన్న సినిమాకి కేటాయించే ఛాన్సుంటుంది.




Tags:    

Similar News