ఇండియాలో IMAX ఆదాయం పైపైకి..!
ఓటీటీ పరిధి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో హాలీవుడ్ సినిమాల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. గతంతో పోల్చితే వసూళ్లు దారుణంగా తగ్గాయి.;
ఒకప్పుడు విదేశాలకే పరిమితం అయిన IMAX స్క్రీన్ గత కొంత కాలంగా ఇండియన్ సినీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. హాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలు సైతం IMAX ల్లో స్క్రీనింగ్ అవుతున్నాయి. 2025లో వచ్చిన సినిమాల్లో IMAX ఫార్మట్ లో విడుదల అయిన సినిమాలు భారీ వసూళ్లు నమోదు చేసినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ముఖ్యంగా హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఎఫ్ 1 ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఎఫ్ 1 కి ఇండియాలో IMAX స్క్రీన్ ద్వారా ఏకంగా 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. గత ఏడాదిలోనే వచ్చిన అవతార్ : ఫైర్ అండ్ యాష్ సినిమా సైతం భారీగా వసూళ్లు నమోదు చేసింది. ఇండియన్ IMAX స్క్రీన్స్ లో అవతార్ 3 భారీగా రాబట్టిందని అంటున్నారు.
IMAX స్క్రీన్‌లో హాలీవుడ్ మూవీస్...
ఇండియన్ స్క్రీన్స్ లో విడుదలైన హలీవుడ్ సినిమాలు మిషన్ : ఇంపాజిబుల్ - ది ఫైనల్ రికనింగ్ సైతం IMAX లో భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇంటర్స్టెల్లార్ రీ రిలీజ్ లోనూ IMAX స్క్రీన్స్ లో సత్తా చాటింది. మొత్తానికి హాలీవుడ్ సినిమాలకు ఇండియన్ IMAX స్క్రీన్స్ మంచి వసూళ్లు తెచ్చి పెడుతున్నాయి. హాలీవుడ్ సినిమాలను చూస్తే IMAX లో చూడాలి అని కోరుకునే వారు చాలా మంది ఉంటున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా IMAX లో స్క్రీనింగ్ చేయాలని బుకింగ్ చేసుకుంటున్న ప్రేక్షకులు ఎక్కువ అయ్యారు. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఐమాక్స్ స్క్రీనింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు కనుక హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయంను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
కాంతార సినిమాకు భారీ వసూళ్లు
కాంతార వంటి రీజినల్ మూవీ కూడా IMAX లో స్క్రీనింగ్ కావడం జరిగింది. విశేషం ఏంటంటే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా కాంతార 2 సినిమా IMAX లో ఏకంగా 1.67 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇది చాలా పెద్ద రికార్డ్‌గా చెప్పుకోవడం జరిగింది. కాంతార మాత్రమే కాకుండా గత ఏడాది ఆరంభంలో వచ్చిన ఛావా సినిమా సైతం IMAX లో అత్యధికంగా వసూళ్లు రాబట్టడం జరిగింది. కేవలం ఐమాక్స్ స్క్రీన్స్ మాత్రమే కాకుండా మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలకు మంచి ఆధరణ లభించింది. గత ఏడాది రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని, థియేట్రికల్ రెవిన్యూ పెరిగింది అంటూ విశ్లేషకులు, పరిశీలకులు మాట్లాడుతున్నారు. మంచి కంటెంట్ ఓరియంట్ సినిమాలకు జనాలు మంచి కలెక్షన్స్ ఇస్తారని గత ఏడాది విడుదలైన సినిమాలు, వాటికి వచ్చిన వసూళ్లను బట్టి మరోసారి నిరూపితం అయ్యింది.
థియేట్రికల్ వసూళ్లు పెరుగుదల..
ఓటీటీ పరిధి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో హాలీవుడ్ సినిమాల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. గతంతో పోల్చితే వసూళ్లు దారుణంగా తగ్గాయి. యావరేజ్ సినిమాలను జనాలు కనీసం థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. మన శంకరవరప్రసాద్ గారు వంటి సినిమాలు సూపర్ హిట్ సాధిస్తే అప్పుడు మాత్రమే జనాలు థియేటర్ లకు కదులుతున్నారు. యావరేజ్ గా ఉంది అంటే దాన్ని ఓటీటీలో చూద్దాం అని వెయిట్ చేస్తున్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీ మనుగడ విషయంలో చాలా మంది నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో 2025 లో థియేట్రికల్ వసూళ్లను చూసి చాలా వరకు ఊరట కలిగించే విషయం అన్నట్లుగా మేకర్స్, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2026 పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ ఏడాది IMAX స్క్రీన్స్ కు ఏ మేరకు వసూళ్లు నమోదు అవుతాయి అనేది చూడాలి.