యాదృచ్చికం... కేథరిన్ ఉంటే మెగా హిట్!!
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు సినిమాల్లో కేథరిన్ థెర్సా హీరోయిన్ కానప్పటికీ ముఖ్య పాత్రలో కనిపించినప్పటికీ సినిమాకు ఆమె చాలా ప్లస్ అయింది, అంతే కాకుండా ఆమెకి సినిమాలు చాలా ప్లస్ అయ్యాయి.;
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవర ప్రసాద్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారం రోజుల్లోనే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ ను నమోదు చేసింది. రెండో వారం పూర్తి అయ్యేప్పటికి సాలిడ్ నెంబర్స్‌ను సొంతం చేసుకుంది. ఈమధ్య కాలంలో ఇలాంటి నెంబర్స్ చూడలేదు అంటూ అభిమానులు, సినీ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. చాలా మంది సినిమాలో ఉన్న కామెడీ గురించి, కొందరు వెంకటేష్ పోషించిన పాత్ర గురించి మరి కొందరు అనిల్ రావిపూడి యొక్క సంక్రాంతి సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నారు. కొందరు మాత్రం కేథరిన్ థెర్సా ఉంటే మెగా హిట్ ఖాయం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో...
కేథరిన్ థెర్సా 'మన శంకరవర ప్రసాద్ గారు' సినిమాలో హీరోయిన్ కాదు, కానీ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ఆమె పాత్ర ఉంది. ముఖ్యంగా చివర్లో కేథరిన్ పాత్ర ట్విస్ట్ అదిరి పోయింది. ఆమె లుక్ తో పాటు, ఆమె పాటల్లో కనిపించిన తీరుకు అంతా కూడా ఫిదా అయ్యారు. అందుకే కేథరిన్ గురించి ఈ సినిమా చూసిన తర్వాత ప్రముఖంగా మాట్లాడుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంత అందంగా ఉంది, ఇంత బాగా యాక్టింగ్ చేస్తుంది ఎందుకు ఆమెకు సోలో హీరోయిన్ అవకాశాలు రావడం లేదు పాపం అని వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారు. కానీ కేథరిన్ కి ఎక్కువగా సెకండ్ లీడ్ రోల్స్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు మాత్రమే వస్తున్నాయి. ఇలాగే ఇంతకు ముందు చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో ముఖ్య పాత్రలో ఈమె నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
చిరంజీవి సినిమాలో కేథరిన్ థెర్సా..
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు సినిమాల్లో కేథరిన్ థెర్సా హీరోయిన్ కానప్పటికీ ముఖ్య పాత్రలో కనిపించినప్పటికీ సినిమాకు ఆమె చాలా ప్లస్ అయింది, అంతే కాకుండా ఆమెకి సినిమాలు చాలా ప్లస్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఈమెను మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం.150లో సైతం ఎంపిక చేయడం జరిగింది. చిరంజీవికి జతగా కేథరిన్ ఖైదీ నెం.150 లో ఐటెం సాంగ్ చేయాల్సి ఉంది. ఆమెను ఎంపిక చేసి, అడ్వాన్స్ సైతం ఇచ్చిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్ కారణంగా ఆమెను తప్పించి మరో హీరోయిన్‌తో ఆ ఐటెం సాంగ్ ను చేయించాల్సి వచ్చిందని మేకర్స్ చెబుతూ ఉంటారు. ఆ కారణాలు ఏంటి అనేది తెలియదు, కానీ ఆ సినిమా కోసం కేథరిన్ ను ఎంపిక చేశారు అనేది వాస్తవం. అందుకే యాదృచ్చికంగా చిరంజీవి సినిమా కోసం కేథరిన్ ను ఎంపిక చేస్తే హిట్ దక్కుతుంది అనే టాక్ మొదలైంది.
మెగా హీరోలకు లక్కీ చామ్ కేథరిన్
హీరోయిన్ గా కేథరిన్ మెయిన్ లీడ్ చేసి చాలా కాలం అయింది. అయినా కూడా ఆమెను జనాలు ఇప్పటికీ ఎమ్మెల్యే అని పిలుస్తున్నారు అంటే ఆమె చేసిన సినిమాలు, ఆమె అందం అనడంలో సందేహం లేదు. అల్లు అర్జున్ తో కూడా కేథరిన్ పలు సినిమాల్లో నటించడం జరిగింది. హీరోయిన్‌గా కాకున్నా ముఖ్య పాత్రలో కేథరిన్ నటిస్తే ఆ సినిమాలు మినిమం పాజిటివ్ టాక్ నుంచి హిట్ టాక్ వరకు దక్కించుకుంటున్నాయి. అందుకే ముందు ముందు చిరంజీవి చేయబోతున్న సినిమాలతో పాటు, ఇతర మెగా హీరోలు చేయబోతున్న సినిమాల్లో కూడా కేథరిన్ థెర్సా ఉండే విధంగా ప్లాన్ చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కేథరిన్ రియాక్షన్ ఏంటో అనేది తెలియాలి. కేథరిన్ మెగా హీరోలకు లక్కీ చామ్ అని చాలా మంది అంటున్నారు. నిజంగానే ఆమె లక్కీ అయితే ముందు ముందు మరిన్ని మెగా హీరోల సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.