ప్ర‌భాస్ అండ్ కో డెహ్రాడూన్ లో సంద‌డి!

ఇందులో ప్ర‌భాస్ స‌హా ప్ర‌ధాన పాత్ర‌ల‌పై సందీప్ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాడు. తాజాగా కొత్త షెడ్యూల్ ఈ నెల‌ఖ‌రు నుంచి డెహ్రాడూన్ లో మొద‌ల‌వుతుంది.;

Update: 2026-01-24 10:19 GMT

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌భాస్-త్రిప్తీ డిమ్రీల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఓరేంజ్ లో క‌నెక్ట్ అయింది. ఈ పోస్ట‌ర్ తోనే కంటెంట్ ఎంత ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంది? అన్న‌ది సందీప్ హింట్ రూపంలో మార్కెట్ లోకి వ‌దిలేసాడు. పోస్ట‌రే ఈ రేంజ్ లో ఉందంటే? అపై రిలీజ్ అయ్యే గ్లింప్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ ఇంకే రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు.తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ వ‌చ్చేసింది. హైద‌రాబాద్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇందులో ప్ర‌భాస్ స‌హా ప్ర‌ధాన పాత్ర‌ల‌పై సందీప్ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించాడు. తాజాగా కొత్త షెడ్యూల్ ఈ నెల‌ఖ‌రు నుంచి డెహ్రాడూన్ లో మొద‌ల‌వుతుంది. ఇందులో ప్ర‌భాస్ తో పాటు ప్ర‌తినాయ‌కుడిపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు ఏక‌ధాటిగా కొన‌సాగ‌నుంది. మ‌ధ్య‌లో విరామం లేకుండా షూటింగ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కి సంబంధించి అన్ని ర‌కాల అనుమ‌తులు తీసుకుని సిద్దంగా ఉన్నారు. ఇక్క‌డే ప్ర‌భాస్ పోలీస్ పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాలు షూట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఐపీఎస్ రోల్ కావ‌డంతో? ప్ర‌భాస్ యూనిఫాం ధ‌రించి పాల్గొంటాడు. ఇంత వ‌ర‌కూ డార్లింగ్ ఒంటి మీద ఖాకీ చూడ‌లేదు. దీంతో అభిమానుల‌కు ఈ షెడ్యూల్ స్పెష‌ల్ వైబ్ తీసుకు రావ‌డం ఖాయం. `ది రాజాసాబ్` రిలీజ్ అనంత‌రం డార్లింగ్ విదేశాల‌కు వెకేష‌న్ కు చెక్కేసిన సంగ‌తి తెలిసిందే. సినిమా డిజాస్ట‌ర్ అయినా డార్లింగ్ మాత్రం ఎక్క‌డా కింగ లేదు. ఎంచ‌క్కా వెకేష‌న్ ఎంజాయ్ చేసాడు. ద‌ర్శ‌కుడు మారుతిని ఎక్కువ‌గా టెన్ష‌న్ తీసుకోవ‌ద్ద‌ని ఓదార్చిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అలాగే ప్ర‌భాస్ `ఫౌజీ` షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే.

70 శాతం ఆ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో `పౌజీ`కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి కొత్త సినిమా ప‌ట్టా లెక్కించాడు. అయితే ఆగ‌స్టులో గా `పౌజీ` కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టిం చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మే లోగా `ఫౌజీ` షూటింగ్ కూడా పూర్తి చేసి డార్లింగ్ బ‌య‌ట‌కు రావాలి. అలాగే ఫిబ్ర‌వ‌రి నుంచి `క‌ల్కి 2` షూటింగ్ కూడా మొద‌ల‌వుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి హెక్టిక్ షెడ్యూల్ న‌డుమ `క‌ల్కి 2`కి డేట్లు ఎలా స‌ర్దుబాటు చేసాడు? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News