స్నేహానికి మించి అడుగు వేయాలి.. మ‌న‌సు విప్పిన దిశా ప‌టానీ

దిశా నిజాయితీకి నిదర్శనం! ఎట్ట‌కేల‌కు ఈ అమ్మ‌డు త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది. టైగర్ ష్రాఫ్ గురించి దిశా ఇంత‌కీ ఏం చెప్పింది?;

Update: 2026-01-24 11:04 GMT

సీకే బ్యూటీ దిశా ప‌టానీ ఏం చేసినా అది సంచ‌ల‌నంగానే మారుతుంది. దిశా త‌న ప్రియుడు టైగర్ ష్రాఫ్ నుంచి విడిపోయిన త‌ర్వాత కూడా త‌న స్నేహాన్ని కొన‌సాగిస్తూనే ఉంది. ఇప్ప‌డు టైగ‌ర్ గురించి దిశా పటానీ ఓపెన‌వ్వ‌డం చ‌ర్చ‌గా మారింది. దిశా తన మనసులోని మాటను ఇంత బహిరంగంగా చెప్పడం నిజంగా ఆశ్చర్యకరం. దిశా నిజాయితీకి నిదర్శనం! ఎట్ట‌కేల‌కు ఈ అమ్మ‌డు త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది. టైగర్ ష్రాఫ్ గురించి దిశా ఇంత‌కీ ఏం చెప్పింది?

దిశా ఎన్న‌డూ లేనంత ఇదిగా ఎమోష‌న‌ల్ గా మాట్లాడింది ఈసారి. జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, ఫైర్ రింగ్‌ల నుండి ఫ్లిప్స్ చేయడం వంటివి కేవలం సినిమాల కోసమే కాదు, టైగర్‌ను ఇంప్రెస్ చేయడానికి కూడా అని దిశా చెప్పింది. తన మాట తీరు చూస్తుంటే, వారి మధ్య ఉన్న బంధం ఎంత ఘాఢ‌మైన‌దో అర్థం చేసుకోవ‌చ్చు.

చాలా సంవత్సరాలుగా వీరిద్దరూ `కేవలం మంచి స్నేహితులం` అని ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ వచ్చారు. కానీ దిశా ఇప్పుడు దానిని `ఐస్ బ్రేక్`లా బ్రేక్ చేయాలని, స్నేహానికి మించి త‌దుప‌రి అడుగు వేయాలని స్పష్టంగా కోరుకుంటున్న‌ట్టు త‌న మాట‌లు చెబుతున్నాయి. టైగర్ ష్రాఫ్ తన ప్రశాంత స్వభావం వల్ల చాలా నెమ్మదిగా ఉన్నాడ‌ని, త్వ‌ర‌గా ఏ నిర్ణ‌య‌మూ చెప్ప‌డ‌ని దిశా మాటలను బట్టి అర్థమ‌వుతోంది.

టైగర్ స్వతహాగా మార్షల్ ఆర్ట్స్, ఫిట్‌నెస్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. బహుశా అందుకే దిశా ఎన్ని ఫీట్లు చేసినా ఆయనకు అవి `సాధారణంగా` అనిపిస్తున్నాయేమో! కానీ దిశా ప్రయత్నం మాత్రం అమోఘం. కేవలం ఒక వ్యక్తి కోసం తన ప్రాణాలకు తెగించి ఫైర్ రింగ్ ఫ్లిప్స్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు.

దిశ కోరుకునే మార్పు వ‌స్తుందా?

ఎవరో ఒకరు మాట్లాడాలి, ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి! అని దిశా ఎంతో ఆవేదన‌గా అనడం చూస్తుంటే, ఇప్పటికే తన వైపు నుండి స్ప‌ష్ఠ‌మైన సంకేతాలు ఇచ్చేసినట్లు అర్థమవుతోంది. ప్రేమ విక‌సించింది.. అది గ‌ట్టు తెంచుకుని దూకుతోంది. ఇప్పుడు బంతి టైగర్ కోర్టులో ఉంది.

ఇప్పుడు టైగర్ ఏం చేయాలి? అంటే అత‌డు కూడా మ‌న‌సు విప్పి మాట్లాడాలి. త‌న స్నేహితురాలి మ‌న‌సును అర్థం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. దిశా తన `ప్రేమ హక్కు` కోసం ధైర్యంగా గొంతు విప్పిన‌ట్టే టైగ‌ర్ కూడా మ‌న‌సు విప్పాలి. మార్చి రిలీజ్ డెడ్ లైన్ కోసం.. పవన్ కళ్యాణ్ సినిమా కోసం హరీష్ శంకర్ ఎలాగైతే స్పీడ్ అప్ అవ్వాలో, దిశా మనసు గెలుచుకోవడానికి టైగర్ కూడా కొంచెం `స్పీడ్ అప్` అవ్వాల్సిన సమయం వచ్చింది! దిశా పటానీ ఇంతలా ప్రయత్నిస్తున్నా టైగర్ ఇంకా `ఇంప్రెస్` అవ్వకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది? అత‌డు ఇంకా దిశాలో ఏవైనా ప్ర‌త్యేక క్వాలిటీస్ ని ఆశిస్తున్నాడా?

దిశా ఇంత‌కుముందు ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడి చిత్రంలో న‌టించింది. త‌దుప‌రి సీక్వెల్ లో క‌నిపిస్తుందా లేదా చూడాలి. ఓ రోమియో, వెల్ కం టు ది జంగిల్, అవార‌పాన్ 2, సంఘ‌మిత్ర చిత్రాలు విడుద‌ల‌కు రావాల్సి ఉంది.

Tags:    

Similar News