'సుమతి సుమతి' అంటున్న అమర్దీప్.. యూత్ ఫిదా!
దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలవ్వగా.. ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా సినిమా నుంచి రెండో సింగిల్ రిలీజ్ అయింది.;
బిగ్ బాస్ రియాలిటీ షోతో సూపర్ ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ అమర్దీప్ చౌదరి. తన అగ్రెసివ్ గేమ్ తో హౌస్ లో మెప్పించారు. ఇప్పటికే బుల్లితెరపై అలరించిన అమర్దీప్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుమతి శతకం మూవీతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమాతో ఎంఎం నాయుడు దర్శకుడిగా పరిచయమవుతుండగా.. సైలీ చౌదరి హీరోయిన్ గా కనిపించనున్నారు.
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న సుమతీ శతకం మూవీని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలవ్వగా.. ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా సినిమా నుంచి రెండో సింగిల్ రిలీజ్ అయింది.
సుమతి సుమతి అంటూ సాగుతున్న సాంగ్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కృష్ణ మాదినేని రాసిన ఆ పాటకు గోల్డ్ దేవరాజ్ స్వరాన్ని అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. మెలోడీతో పాటు యువతను ఆకట్టుకునే బీట్ తో సాంగ్ ను రూపొందించారు. 'నా కుట్టీ కుట్టీ సుమతీ, నా చిట్టీ చిట్టీ సుమతీ.. ' అంటూ సాగిన ఆ పాటలో హీరో తన ప్రేమను మధురంగా వ్యక్తపరుస్తున్నట్లు చూపించారు.
అమర్దీప్ యాక్టింగ్, సైలీ చౌదరి ఎక్స్ప్రెషన్స్ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అదే సమయంలో సాంగ్ లో డ్యాన్స్ స్టెప్స్ కూడా చాలా సింపుల్ గా ఉండటంతోపాటు యూత్ అంతా ఈజీగా అనుసరించేలా ఉన్నాయి. అందుకే ఈ పాట త్వరలోనే చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని అంచనాలు వస్తున్నాయి.
ఇప్పటికే సుమతీ శతకం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఎక్కడే ఎక్కడే సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు సెకెండ్ సింగిల్ సుమతి సుమతి కూడా అందరినీ మెప్పిస్తోంది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అదే సమయంలో మూవీలో మంచి ప్రేమకథతో పాటు ఎంటర్టెన్మెంట్ ఎలిమెంట్స్ ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ళ గోపీ కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు ఎస్ హలేష్ నిర్వహించగా, నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. బండారు నాయుడు రచనా బాధ్యతలు చేపట్టగా.. డిజిటల్ మార్కెటింగ్ ను హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం సంస్థలు చూసుకుంటున్నాయి. మొత్తంగా కొత్త పాట విడుదలతో సుమతీ శతకంపై ఇంట్రెస్ట్ మరింత పెరగ్గా.. ఫిబ్రవరి 6న విడుదల కానున్న మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.