గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ కి చేదు అనుభవం.. అసలేం జరిగిందంటే ?

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా.. గ్లామర్ నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మౌనీ రాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;

Update: 2026-01-24 13:20 GMT

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా.. గ్లామర్ నటిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మౌనీ రాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో.. మత్తెక్కించే కళ్ళతో అభిమానులను మాయ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమెకు తాజాగా చేదు అనుభవం ఎదురయింది. ముఖ్యంగా తాతల వయసున్న వ్యక్తులు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ సెలబ్రిటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మౌనీ రాయ్ కు హర్యానాలోని కర్నాల్ లో జరిగిన ఒక వివాహ వేడుకలో అసహ్యకరమైన అనుభవం ఎదురయిందట. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "నేను ప్రదర్శన ఇవ్వడానికి స్టేజ్ పైకి వెళ్తున్న సమయంలో కొంతమంది పురుషులు , వృద్ధులు ఫోటోలు తీసే నెపంతో నాపై అసభ్యకరంగా ప్రవర్తించారు. నడుము పై చేతులు వేయడం, దగ్గరకు వచ్చి అనుచితంగా తాకడం వంటి చర్యలు నన్ను తీవ్రంగా మనస్థాపానికి గురిచేసాయి. ముఖ్యంగా నేను వద్దని చెప్పినా వాళ్ళు వెనక్కి మాత్రం తగ్గలేదు. ఇది చాలా అవమానకరంగా అనిపించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మౌని రాయ్.

"స్టేజ్ కింద మాత్రమే కాదు స్టేజ్ పై ప్రదర్శన ఇస్తున్న సమయంలో కూడా కొంతమంది అసభ్య సంకేతాలు చేయడం, అభ్యంతరకర పదజాలంతో వేధించడం నన్ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసింది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఆర్గనైజర్లు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తట్టుకోలేకపోయాను. ఇలాంటి ఈవెంట్లలో ఆర్టిస్టుల భద్రతకు కనీస ఏర్పాట్లు చేయకపోవడం మరింత బాధాకరం" అంటూ చెప్పుకొచ్చింది మౌనీ రాయ్. ఇక ప్రస్తుతం మౌనీ రాయ్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి అభిమానులతో చెప్పుకోవడంతో నెటిజన్స్ సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. పబ్లిక్ ఈవెంట్లలో మహిళా కళాకారులకు సరైన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ ఈవెంట్ నిర్వాహకులదేనని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మౌనీ రాయ్ విషయానికి వస్తే.. హిందీ టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె టీవీ సీరియల్స్ లో ఇండియాలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న సెలబ్రిటీ జాబితాలో ఒకరిగా నిలిచింది.

నాగిన్ సిరీస్ తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఇందులో నాగిని పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించింది. అంతేకాదు ఇందులో అద్భుతమైన నటన కనబరిచినందుకు రెండు ఫిలింఫేర్ అవార్డులు, రెండు ఐటిఏ అవార్డులతో పాటు IIFA అవార్డులు కూడా లభించాయి..

సీరియల్స్ లోనే కాకుండా సినిమాలలో కూడా నటించింది . 2011లో హీరో హిట్లర్ ఇన్ లవ్ అనే సినిమాతో సినీ రంగప్రవేశం చేసింది. ఇందులో ఉత్తమ నటన కనబరచడంతో ఉత్తమ మహిళ అరంగేట్రం కోసం ఫిలింఫేర్ అవార్డుకు నామినేషన్ కూడా అందుకుంది.ఇక 2022లో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాలో కూడా నటించింది.

Tags:    

Similar News