కపుల్ కు షాక్.. ఎంత చేసినా కంటెంట్ ఉంటేనే కదా!

సినిమా విడుదలకు ముందు నుంచి రిలీజ్ తర్వాత కూడా ఆ ఛానల్‌ లో వరుసగా వీడియోలు, ఇంటర్వ్యూలు, రివ్యూలు వచ్చాయి.;

Update: 2026-03-13 09:30 GMT

ఎంత ప్రమోషన్ చేసినా.. చివరికి రిజల్ట్ నిర్ణయించేది కంటెంట్‌ అన్న విషయం మరోసారి ప్రూవ్ అయింది. ఇటీవల విడుదలైన ఒక సినిమా విషయంలో ఇదే పరిస్థితి కనిపించింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ కపుల్ తమ సోషల్ మీడియా ఛానల్ ఆ చిత్రానికి భారీ స్థాయిలో ప్రచారం చేసింది. సినిమా విడుదలకు ముందు నుంచి రిలీజ్ తర్వాత కూడా ఆ ఛానల్‌ లో వరుసగా వీడియోలు, ఇంటర్వ్యూలు, రివ్యూలు వచ్చాయి.

దీంతో సినిమా టీమ్‌ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు కనిపించింది. సినిమాలో యాక్ట్ చేసిన ప్రధాన నటీనటులను మాత్రమే కాకుండా, దర్శకుడు, నిర్మాతలు వంటి కీలక వ్యక్తులను కూడా ఆ ఛానల్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఒక్కో ఇంటర్వ్యూ గంటల తరబడి సాగుతూ సినిమా కోసం వివరించేలా ఉండేది. మూవీ స్టోరీ, ప్రొడక్షన్ వాల్యూస్, క్యాస్టింగ్ యాక్టింగ్.. ఇలా ప్రతి అంశాన్ని ఎంతో పాజిటివ్‌ గా చూపించే ప్రయత్నం చేశారు.

అలా సోషల్ మీడియాలో ఆ సినిమాపై ఒక రకమైన హైప్ కూడా ఏర్పడింది. మూవీ విడుదలకు ముందు రోజుల్లో ఆ ఛానల్ చేసిన ప్రమోషన్లు చూసిన చాలా మంది ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి చూపించారు. సోషల్ మీడియా పోస్టులు, వీడియో క్లిప్స్, ఇంటర్వ్యూల ద్వారా మూవీ మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న కనిపించింది. అయితే థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మొదటి రోజే సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. భారీ ప్రచారం ఉన్నప్పటికీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా కనిపించింది. మొదటి రోజు కలెక్షన్లు కూడా సాధారణ స్థాయికి పరిమితమయ్యాయి. తర్వాతి రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రేక్షకులు సినిమాను చూసిన తర్వాత సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకోవడం ప్రారంభించారు.

సినిమాలో కథ వీక్ గా ఉందని, కథనం ఆకట్టుకునేలా లేదని చాలా మంది ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు. కొంతమంది నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ మొత్తం సినిమా మాత్రం నిరాశపరిచిందని అభిప్రాయపడ్డారు. అలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గిపోయింది. ఇలా కొన్ని రోజుల్లోనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డౌన్ అయిపోయింది.

మొదట్లో ఉన్న అంచనాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో చివరకు ఆ సినిమా డిజాస్టర్‌ గా మిగిలిపోయింది. భారీ ప్రమోషన్, సోషల్ మీడియా సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఫెయిలైంది. దీంతో సోషల్ మీడియా ద్వారా సినిమా గురించి ఎంత పాజిటివ్ ప్రచారం జరిగినా, చివరికి ప్రేక్షకులను ఆకట్టుకునేది కంటెంట్ మాత్రమే. కథ స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమా ఎప్పుడైనా నిలబడగలదు. లేదంటే ఎంత ప్రమోట్ చేసినా ప్రేక్షకులు మొగ్గుచూపించరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదేమో.

Tags:    

Similar News