'మేజర్' నుంచి తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల ఫస్ట్ లుక్..!

Update: 2021-04-09 12:58 GMT
యంగ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ''మేజర్''. 26/11 ముంబై తీవ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'గూఢచారి' ఫేమ్ శ‌శి కిర‌ణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సైఈ మంజ్రేకర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం, తాజాగా శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

'మేజర్' చిత్రంలో శోభిత 'ప్రమోద' అనే ఎన్నారై అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 'ఆమెకు ధైర్యం లేదు.. కానీ వేరే మార్గం లేదు' అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ లో శోభిత ఓ పాపను ఎత్తుకొని భయపడుతూ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 12న మేజర్ టీజర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ - మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడంతో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. 'మేజర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో జులై 2న విడుదల చేయనున్నారు.
Tags:    

Similar News