• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కేజీఎఫ్'కు నో చెప్పి...

'కేజీఎఫ్'కు నో చెప్పి 'కేజీఎఫ్-2'లో నటించింది.. అందుకేనట!

By - Tupaki Desk
Update: 2021-02-19 09:30 GMT
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రవీనా టాండన్ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2తో మళ్లీ సౌత్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. 1993లో బాలకృష్ణ సరసన బంగారుబుల్లోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టి మళ్లీ ఆ సినిమా తర్వాత కనిపించకుండా పోయింది. మొత్తంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 మూవీలో కీలకపాత్ర పోషించింది. నిజానికి రవీనాను ఫస్ట్ కేజీఎఫ్ చాప్టర్ గురించి కూడా సంప్రదించారట మేకర్స్. కానీ స్టోరీ విన్నాక తన పాత్ర పూర్తిగా డెవలప్ చేయలేదని భావించి కేజీఎఫ్ ఫస్ట్ పార్టుకు నో చెప్పేసిందట. మధ్యలో ఆ పాత్రను సగం సగంగా సరిగ్గా చూపించకపొతే బాగుండదనే సందేహం కూడా ఉండేదట ఆమెకు.

అయితే ఎప్పుడైతే కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ చూసిందో.. సెకండ్ పార్టులో నటించడం అదృష్టంగా భావిస్తుందేమో కాబోలు. ఇటీవలే విడుదల చేసిన కెజిఎఫ్-2 టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ప్రేక్షకులకు పాన్-ఇండియన్ అనుభూతిని కలిగించడానికి బాలీవుడ్ నటులు కేజీఎఫ్ లో కనిపించడం మనం చూడవచ్చు. ఇదిలా ఉండగా.. రవీనా కెరీర్ లో కేజీఎఫ్-2 సెకండ్ కన్నడ మూవీనట. మరి మొదటిది ఏంటంటే.. స్టార్ హీరో ఉపేంద్ర కథానాయకుడుగా తెరకెక్కిన ‘ఉపేంద్ర’ సినిమా. రవీనా నటించిన ఏకైక కన్నడ సినిమా ఇదే. అయితే కన్నడం, తెలుగు, తమిళ భాషలలో డైలాగ్స్ చెప్పడం చాలా ఈజీ అంటోంది. అందుకే ఆమెకు సౌత్ ఇండియా మూవీలలో నటించేటప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించదు అంటూ చెప్పుకొచ్చింది.
Tags:    
  • Yash 
  • KGF 
  • KGF2 
  • Prashanth Neel 
  • Yash Next Movie Updates 
  • Sanjay Dutt 
  • prakash Raj 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS