మళ్లీ రిస్క్ కి రెడీ అయిపోయాడా?

Update: 2017-02-19 04:40 GMT
యంగ్ హీరో శర్వానంద్ వైవిధ్యభరితమైన రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. కానీ కొంత కాలంగా కమర్షియల్ రూట్ లోకి వచ్చేసి.. భారీ సక్సెస్ లనే కొట్టేస్తున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన శతమానం భవతి మూవీతో 30 కోట్ల రూపాయల షేర్ ను అందుకుని.. తన కెరీర్ బెస్ట్ కూడా సాధించేశాడు.

సంక్రాంతికి ఖైదీ నంబర్ 150.. గౌతమిపుత్ర శాతకర్ణి పోటీ పడుతుంటే.. వాటి మధ్యలో తన సినిమాను నిలబెట్టి పెద్ద రిస్క్ నే చేసినా.. ఆశించిన స్థాయికి మించిన ఫలితాన్నే అందుకున్నాడు శర్వానంద్. ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో రిస్క్ కి రెడీ అయిపోయాడట. చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న మూవీలో నటిస్తున్నాడు శర్వా. ఈ చిత్రంలో కుర్రాడు పోలీస్ అవతారంలో కనిపించనుండగా.. గ్లామర్ రూట్ లోకి వచ్చేయాలని ఫిక్స్ అయిన లావణ్య త్రిపాఠి అందాలు ఆడియన్స్ కు బోనస్ కానున్నాయి.

ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేసేస్తాడట శర్వానంద్. ఆ సమయానికి కాటమరాయుడు.. బాహుబలి ది కంక్లూజన్.. దువ్వాడ జగన్నాధం.. ఇలా భారీ చిత్రాలన్నీ షెడ్యూల్ చేసి ఉండగా.. వాటి మధ్యలో తన సినిమాను నిలబెట్టేయాలని ఫిక్స్ అయిపోయాడట. రిస్క్ చేసిన ప్రతీసారి మంచి ఫలితాన్నే అందుకోవడం ఈ హీరోకి సెంటిమెంట్ కూడా అయిపోయిందిలే. అందుకే మళ్లీ రిస్క్ కి రెడీ అయిపోయాడు యంగ్ హీరో శర్వానంద్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News