మజిలీ పెళ్లాంలా చెప్పింది వినాలి!-శర్వా
యంగ్ హీరో శర్వానంద్ క్లీన్ ఇమేజ్ గురించి తెలిసిందే. ఇన్నేళ్ల కెరీర్ లో ఎఫైర్ అనే మచ్చ ఎనాడూ లేదు. ప్రేమ దొమ అన్న గాసిప్పులైనా అతడిపై లేవు. కథానాయికలతో డేటింగులు గట్రా చేసిన అనుభవం లేనే లేదు. వృత్తి ప్రవృత్తి.. నా ఇల్లు అన్నట్లే ఉంటాడు. వివాదరహితుడిగా క్లీన్ ఇమేజ్ ఉంది. మెగాస్టార్ అన్నట్టు మంచి మాట బయటికి.. చెడ్డ మాట చెవిలో చెబుతాడు. శర్వా లో ఆ క్వాలిటీ గురించి సాటి నాయికలే చెబుతుంటారు.
తాజాగా జాను ప్రచారంలో భాగంగా సమంత కూడా అదే అంటోంది. శర్వా జీవితంలో ఇప్పటివరకూ ప్రేమ లేదు..పెళ్లి లేదు. అతని లైఫ్ బోరింగ్ అంటూ అదిరిపోయే పంచ్ నే వేసేసింది. సినిమా రంగంలో ఉంటే సహజంగా ఎఫైర్లు ఉంటాయి. కానీ శర్వా గురించి ఎక్కడా ఒక రూమర్ కూడా రాలేదు. ఓసారి నాకు డౌట్ వచ్చి గూగూల్ లో చెక్ చేసా! కానీ అతని సింగిల్ ఫోటోలు... సినిమా హీరోయిన్లతో సినిమాల్లో నటించిన ఫోటోలు తప్ప..వ్యక్తిగతంగా కనీసం ఏ అమ్మాయితోనూ ఫోటో దిగినట్లు కూడా ఎక్కడా దొరకలేదు. అందుకే శర్వాకి బి(బోరింగ్) అనే లెటర్ కరెక్ట్ గా సూటవుతుంది.
మరి శర్వా కి కాబోయే అమ్మాయి ఎలా ఉండాలి అంటూ శర్వాని ఓ ఇంటర్వూలో ప్రశ్నించగా.. ఇప్పటివరకూ నాకు ప్రేమ కథలు లేవు. కానీ నేను మజిలీ సినిమాలో సమంత లాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. భర్త ఏం చేసినా సైలెంట్ గా ఉండాలి. భర్తని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఓ అమ్మాయిలో అలాంటి లక్షణం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అమ్మాయి కోసం వెతుకుతన్నాను అంటూ హింట్ ఇచ్చేసాడు శర్వా. అయితే ఈరోజుల్లో మజిలీ లో లాంటి అమ్మాయి దొరకదు సరికదా.. దబిడ దిబిడే అంటూ దంచి కొట్టని పెళ్లాం దొరికితే సంతోషమే. మజిలీ భార్యామణిలా నూటికో..కోటికో ఒకరుంటారన్నది లోకైక నిరతి. అలాంటి వాళ్లు దొరకాలంటే జల్లెడ వేసి పట్టుకోవాల్సిందే. మరి శర్వా కోసం సమంత లాంటి అమ్మాయి ఎక్కడ పుట్టిందో.