• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో...

కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో శర్వా..?

By - Tupaki Desk
Update: 2021-09-22 02:30 GMT
టాలెంటెడ్ హీరో శర్వానంద్ కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేస్తుంటాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'శ్రీకారం' సినిమాతో పలకరించిన శర్వా.. మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్వకత్వంలో శర్వా ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.

శర్వానంద్ హీరోగా రాజు సుందరం డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంఫర్మ్ అయిందని అంటున్నారు. ఇన్నాళ్లూ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతుండగా.. ఇటీవలే శర్వా సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ వచ్చిందట. ఈ నేపథ్యంలో అప్పుడెప్పుడో 'ఏగన్' అనే సినిమాతో దర్శకుడి అవతారమెత్తిన రాజుసుందరం.. ఇప్పుడు శర్వా కోసం మరోసారి మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

శర్వా - రాజు సుందరం కాంబోలో రాబోయే ఈ చిత్రానికి ప్రముఖ దర్శక రచయిత వక్కంతం వంశీ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే శర్వానంద్ ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' చిత్రంలో నటిస్తున్నాడు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలోకి వస్తోంది.

అలానే కిషోర్ తిరుమల డైరెక్షన్ లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు శర్వా. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఏడాది చివరి నాటికి పూర్తి చేయనున్నారు. ఇక శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడితో శర్వా 'ఒకే ఒక జీవితం' అనే సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Tags:    
  • sharwanand 
  • Raju Sundaram 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS