• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `2.0` సీన్స్ అంత...

`2.0` సీన్స్ అంత న‌చ్చాయంట‌!

By - Tupaki Desk
Update: 2018-07-13 10:58 GMT
ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `2.0` గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా విజ‌య‌వంత‌మైన `రోబో`కి సీక్వెల్ కావ‌డం... సుమారు రూ: 500 కోట్ల‌తో రూపొందిన  అత్యంత భారీ చిత్రం  కావ‌డంతో విడుద‌లపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.  విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన ప‌నులు పూర్తి కాక‌పోవ‌డంతో ప‌లు మార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కి ఇటీవ‌లే విడుద‌ల తేదీని ఖరారు చేసుకుంది. నవంబ‌రు 29న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు శంక‌ర్ వెల్ల‌డించారు. దాంతో అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఈ సినిమా వేడి  మొద‌లైంది.

అయితే ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప‌లుమార్లు సినిమా విడుద‌ల వాయిదా ప‌డ‌టంతో - ఈ సినిమా హ‌క్కులు కొనుక్కున్న ప‌లు ప్రాంతాల ఇన్వెస్ట‌ర్లంతా త‌మ డ‌బ్బుని త‌మ‌కి వెన‌క్కిచ్చేయాల‌ని నిర్మాత‌ల‌పై ఒత్తిడి తీసుకొచ్చారట‌. విడుద‌ల తేదీని ఖ‌రారు చేశాక కూడా కొద్దిమంది ఇదే డిమాండ్ చేశార‌ట‌. అందులో తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్ కూడా ఉన్న‌ట్టు తెలిసింది.  ఆ విష‌యం ద‌ర్శ‌కుడు శంక‌ర్ దృష్టికి రావ‌డంతో ఆయ‌న... డ‌బ్బు తిరిగిచ్చేయ‌మ‌ని అడిగిన వాళ్లంద‌రినీ చెన్నైకి పిలిపించి చిత్రంలోని 15 నిమిషాల ఫుటేజీని ప్ర‌త్యేకంగా  చూపించాడ‌ట‌. అది చూశాక మా డ‌బ్బు మాకు వెన‌క్కివ్వాల‌ని డిమాండ్ చేసినవాళ్లంతా మ‌రోమాట మాట్లాడ‌కుండా వెన‌క్కి వ‌చ్చేశార‌ట‌. ఆ స‌న్నివేశాలు అంత  బాగా న‌చ్చాయ‌ట‌.  ఆల‌స్య‌మైనా ప‌ర్లేదు...  సినిమా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ఇన్వెస్ట‌ర్లంతా ఆనందంగా ఇంటికొచ్చార‌ట‌. ఆ 15 నిమిషాల స‌న్నివేశాలు అంత మేజిక్ చేశాయ‌ట‌. మ‌రి సినిమాని మొత్తం ఏ రేంజిలో ఉంటుందో చూడాలి. `బాహుబ‌లి` త‌ర్వాత ఆ స్థాయిని మించిన బ‌డ్జెట్‌ తో రూపొందిన భారీ చిత్ర‌మిది. ఇది కూడా బాహుబ‌లి స్థాయిలో విజ‌య‌వంత‌మైందంటే   ఇక ప్ర‌పంచం మొత్తం ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌వైపు చూడ‌టం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.
Tags:    
  • Shankar 
  • Robo 2.0 Movie 
  • Telugu NEws 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS